Search
Thursday 19 April 2018
  • :
  • :
Latest News

పురాగ మరిశిపోయిన పని.. బాయిల పూటిక తీసుడు

Well

కొన్ని కొన్ని వృత్తులు పురాగ మరిచిపోయినట్లే అయితన్నయి. మరిచిపోతున్నాము అంటే మల్లా ఉండాలని కోరడం కాదు ఈ తరానికి గుర్తు చేయమమే అన్నట్టు. ఎక్కడ ఊర్లల బాయిల ఉండేటివి. అందులో పూటిక తీసుడు అనే పని ఉండేది. పూటిక అంటే నీళ్ళకోసం తవ్విన బాయి ఐదు పది ఏండ్లు అయినంక అల్లో రకరకాల కారణాల వల్ల మన్ను నిండుతది. లేకుంటే అడుగు నాని మెత్తగ అయితది. దానిని తీసివేయడం ద్వార మల్లా నీళ్ళు ఎక్కువ ఊట ఊరే అవకాశం ఉన్నది. దీనినే పూటిక తీసుడు అంటరు. పూటిక తీసేందుకు మోట బావికి మోటకొట్టినట్టే ఇద్దరు మనుషులు కాని పట్టుకొని మోట బోర్లల్లకు గుంజుతరు. బాయిలోపల ఇద్దరు మనుషులు ఉండి ఒగలు పారతోని తట్టల నింపుతరు. ఇంకొకరు తట్టను తాళ్ళకు కట్టి పోనియ్.. అంటడు అప్పుడు బాయిమీద దందెడ కదురు దగ్గర ఉన్నాయన ముందుకు నడువుమంటే ఆ మట్టి తట్టమీదకి వస్తది. అప్పుడ ఆ తట్టలను తీసక పోయెందుకు ఇద్దరు మనుషులు సిద్దంగ ఉంటరు. ఇది పోద్దుందక చేస్తే కూడా రెండు బండ్ల నిండ కాదు. చాలా కష్ఠమైన పనేగకూండా తట్ట లెగె బాయిల పడుతె బాయిల ఉన్నవల్ల తలకయపలుగుడే. అయితే ఇప్పుడు ఈ రాద్దంతం లేదు ఒక్క రోజుల బోర్ వేస్తున్నరు నీళ్ళు పాతళం నుంచి గుంజుతున్నరు.

ఎడ్లతోని మోటలు కట్టేకాలం నుండి కరెంట్ మోటర్లు నడచినప్పుడు సుత మనుషులతోని పూటిక తీసినం అనంతక కాలంల క్రేన్ మిషన్లతో ఆ పనికానిచ్చేవల్లు. ఇది ఎవుసంకాడి బాయిల సంగతి ఇగ శేదబాయిలల్ల పూటిక తీయలంటే అందరితోని కాదు శేద బాయిలు అంటే ఊర్లల్ల ఇంటింటికి ఉంటయి గజం వెడల్పులోనే గుండ్రగ ఉంటయి . అండ్లకు మనిషి దిగూడే కష్టకాలం. మెల్లగ దిగి గడ్డిపార తోని తవ్వుకుంట తవ్వుకుంట పోయి పారలోని మన్నుతీసి బయిటకి శాంతాడు బొక్కెన తోని పంపిచ్చుడ శాంతాడు తెగిందంటే లోపలున్న మనిషి ఇంటే సంగతులు. ఇది కోంచం జాగ్రతతో చేసే పనే. అయితే శాదబాయిలల్ల పూటికలు తీసుడు అందరితో కాదు ఊరికి కొందరే స్పెషలిస్ట్‌లు ఉంటరు వల్లలో నేరిపిస్తరు. ఇంటికాడ బాయిలల్ల పూటిక తీపిస్తే అండ్లకెల్లి శిన్నపిలగాడ్లు పారేశిన చెంచలు గిలాసలు పలకలు కన్పిచ్చి సంబురం అయితయి. బాయిల పూటిక తీసినంకా నీళ్ళు తెల్లగ అయితయి.

అప్పుడు నీళ్ళ ఊడ ఊరుతాయి . ఈ కాలంల బాయిల సంగతి తెల్వదు . బోర్‌వెసి నీళ్ళు పైకి తీస్తున్నాకాలం. ఆ కాలంల ఊల్లల సుత అక్కడక్కడ ధర్మబాయిలు ఉండేది. అవి ఊరంతరకు వడుకునేందుకు సర్కారు తవ్వియిన బాయిలు ఇప్పుడైతే ఊర్లల్ల నల్లాలే నీళ్ళు మినరల్ వాటర్ ప్లాంట్లు ఇంటింటికి పైపులైనులు ఆర్‌వో మిషనులు వచ్చనయి ఏది ఏమైన అభివృద్ధి అనేది వ్యాపించింది అట్లనే వ్యాపారం వ్యాపించింది అట్లనే రోగాలు ఆసుపత్రులు వ్యాపించినయి. చేర్లు బాయిలే వ్యవసాయనికి నీళ్ళ వనరులు ఊర్లల్ల బాయిలకు పేర్లు కూడా ఉంటయి. మర్రి బాయి, తెట్టెబాయి, తోటపెరజ బాయి, ఎవలబాయి అయిన అందరికి తేల్సిన పేర్లలోనే వ్యవహరిస్తారు. ఆ బాయిలల్ల ఈతలు నేర్చుకునేది. పోరగాండ్లు ఈత నేర్చుకునేది చెర్లల్లనే వానకలంల నయితే బాయిలు కుంటలు కొప్పురంగ నిండిన పండుగ పూటిక ఇప్పుడు కనపడని పని లేని పని.

-అన్నవరం దేవేందర్, 9440763479

Comments

comments