Search
Friday 20 April 2018
  • :
  • :

సిఎంను కలిసిన టెస్కాబ్ చైర్మన్ కొండూరి

cmసీఎం చంద్రశేఖర్‌రావును, ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్న టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు

మనతెలంగాణ/సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కు చెందిన టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి వివిధ అభివృద్ధి పనులపై చర్చించారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగవరంకి చెందిన కొండూరి రవీందర్‌రావు తెలంగాణ రాష్ట్ర సహకార సంఘాల సమాఖ్య (టెస్కాబ్ ) చైర్మన్ వ్యవహరిస్తున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసి అభినందించడంతోపాటు రాష్ట్రంలో సహకార కేంద్ర బ్యాంకులు చేపడుతున్న అభివృద్ధి పనులను సమీక్షించారు. సిఎం కెసిఆర్ కొండూరి రవీందర్‌రావు పనితీరును అభినందించారు. ఇప్పటికే కొండూరి రవీందర్‌రావు పనితీరును దేశ విదేశాల ప్రతినిధి బృందాలు ప్రశంసించిన నేపథ్యంలో కొండూరికి మంగళవారం సీఎం ప్రశంస మరో కీర్తి కిరీటంగా భావించాలి.  ముఖ్యమంత్రి కెసిఆర్‌తోపాటు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిలను కూడా టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు కలిసి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Comments

comments