Search
Tuesday 19 June 2018
  • :
  • :

దళితుల జీవితాలలో వెలుగులు నింపడమే ప్రభుత్వ లక్ష్యం

stage

*1985లో దళిత జ్యోతిని ప్రారంభించింది కేసీఆర్
*ప్రతి గ్రామానికి అంబేడ్కర్ భవనాలు, వ్యాయామ శాలలు
*ఐదు లక్షల సబ్సిడీతో కూడిన రూ.పది లక్షల రుణాలు
*యువతకు 162 క్రికెట్ కిట్లు పంపిణీ : మంత్రి జగదీశ్‌రెడ్డి

మన తెలంగాణ/సూర్యాపేట : దళితుల జీవితాలలో వెలుగులు నిం పడమే సీఎం కేసీఆర్ లక్షమని, అందుకు దారిద్య్ర రేఖ కింద ఉన్న దళితులు నిజమైన అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెం దుతుందని భావించిన మహనీయుడు సీఎం కేసీఆర్ అని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర విద్యుత్తు, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేటలో జరిగిన దళితుల సదస్సులో ఆయన పాల్గొని ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 73 గ్రామాల దళిత యువకులకు 162 క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాను క్రీడలలో జాతీయ స్థాయి లో తీసుకెళ్లేందుకు క్రీడాకారులు స్ఫూర్తి కొనసాగించాలన్నారు. అందు కు సీఎం దళిత యువత కోసం ప్రవేశపెడుతున్న అనేక కార్య క్రమాలే నిదర్శనమన్నారు. దళిత జ్యోతిని 1985లో మొట్టమొదటగా ప్రారంభి ంచింది సీఎం కేసీఆరే అని వివరించారు. యూరఫ్‌లోని అత్యంత ఎత్తైన శిఖరాన్ని అధిరోహించింది నల్లగొండకు చెందిన దళిత బిడ్డేనని తెలిపారు. కార్పొరేట్ విద్యకు దీటుగా ఎస్సీ గురుకులాలను ఏర్పాటు చేయాలన్న ఆకాంక్షను నెరవేర్చుతున్నాడని పేర్కొన్నారు. రాష్ట్రంలోని గ్రామ గ్రామాన అంబేడ్కర్ భవనాలు నిర్మించి వ్యాయామ శాలలు ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఐదు లక్షల సబ్సీడి రుణాలతో ఎస్సీ యువతకు ఉపాధి కోసం రూ. 10 లక్షల రుణాలను అందజేయ నున్నట్లు వెల్లడించారు. శుభకార్యాలు జరుపుకోవడానికి ఎ స్సీ కమ్యూనిటీ హాల్స్, అంబేడ్కర్ ఓవర్‌సిస్ పథకానికి రూ. 20 లక్ష లు, దళితులకు మూడెకరాల భూమి లాంటి పథకాలతో వారి ఆకాంక్షను నెరవేర్చిన ఘనత సీఎంకే దక్కిందన్నారు. జిల్లా ప్రజల ఆదరణను చూసే సీఎం ప్రేమతో మెడికల్ కళాశాలను ఇచ్చినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ. 1500 కోట్ల వెచ్చించినట్లు వెల్లడిం చారు.  ముఖ్యంగా యువతకు వచ్చిన అవకాశాలను జారవిడుచుకో వద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక ప్రకాశ్, జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ వై.వెంకటేశ్వర్లు, వైస్ ఛైర్మన్ కాకి కృపాకర్‌రెడ్డి, పబ్లిక్ క్లబ్ అధ్యక్షులు కట్కూరి గన్నారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ నేరేళ్ల లక్ష్మీ, ఆత్మకూర్ ఎంపిపి కసగాని లక్ష్మీ, చివ్వెంల ఎంపిపి కల్పగిరి యశోద, రౌతు నర్సింహారావు, పలువురు కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments