Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

అత్యుత్తమ సేవలే ధ్యేయం

doctor

– సిబ్బంది పనితీరు మెరుగుపడాలి
– రోగులకు అందుతున్న వైద్యంపై ఆరా
– జిల్లా ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

మన తెలంగాణ/ సంగారెడ్డి ప్రతినిధి : రోగులకు జిల్లా ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది మరిన్ని మెరుగైన సేవలందించాలని కలెక్టర్ మాణిక్కరాజ్ కణ్ణన్ ఆసుపత్రి సూపరింటిండెంట్ రాజుగౌడ్‌కు సూచించారు. బుధవారం జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిని  కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మాతా శిశు ఆసుపత్రిలో గల పోస్టునేటల్ వార్డులో  పేషంట్లతో ఆసుపత్రిలో వారికి అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ కిట్లు సకాలంలో అందుతున్నాయా లేదా అని వారిని అడిగారు. ఆసుపత్రిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి సూపరింటిండెంట్ రాజుగౌడ్‌ను ఆదేశించారు. పారిశుద్ధ విభాగంలో షిప్ట్‌ల వారిగా ఎంతమంది పనిచేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. పేషెంట్ కేర్ ప్రొవైడర్స్ సరిగా లేరని, వారి సంఖ్యను పెంచి రోగులకు సేవలందించాలని కలెక్టర్ సూచించారు. ప్రతి ఐదు బెడ్‌లకు ఒకరి చొప్పున ఉండేలా చూడాలన్నారు. ఈ ఆకస్మిక తనిఖీలో ప్రభుత్వ ఆసుపత్రి పాత భవనాన్ని కలెక్టర్ సందర్శించారు. పేషంట్లతో పాటు వచ్చే అటెండెంట్స్ వేచి ఉండేందుకు వీలుగా వెయిటింగ్ హాలును ఏర్పాటు చేయాలన్నారు. కార్డియాలజీ విభాగపు నిర్మాణపు పనుల పురోగతిని కలెక్టర్ పర్యవేక్షించారు. ఆసుపత్రి ఆధునీకరణ (ఫేస్ లిప్ట్) పనులు జనవరి 26 నాటికి పూర్తిచేయాలని సంబంధిత ఇంజనీర్లను ఆదేశించారు. ఆసుపత్రిలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న వెల్‌నెస్ సెంటర్‌ను కలెక్టర్ సందర్శించారు. ఈ విషయంపై సం తృప్తి వ్యక్తం చేశారు. ఈ ఆకస్మిక తనిఖీలో కలెక్టర్ వెంట ఇన్‌ఛార్జి డిఎంఅండ్‌హెచ్‌వో డా.గాయత్రి, ఆర్‌ఎంవో డా. సంగారెడ్డి, డా. శశాంక్, డిస్ట్రిక్ క్వాలిటీ అస్సురెన్స్ మేనేజర్ రవి, తదితరులు ఉన్నారు.

Comments

comments