Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

పల్లెలకు కేంద్ర నిధులే శరణ్యం

bjp2

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీందర్‌రెడ్డి
మనతెలంగాణ/రాయికల్: రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలకు నిధులు అందించకుండా కాలయాపన చేస్తుందని ప్రస్తు తం పల్లెలకు కేంద్ర నిధులే దిక్కయ్యాయయని బిజెపి రాష్ట్ర కా ర్యవర్గ సభ్యులు ముదిగంటి రవీందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని రామాజీపేట, భూపతిపూర్ గ్రామాల్లో ఆదివారం ఆయన పర్యటించారు.ఇటీవల మృతి చెందిన పలువురు బాధితుల కు టుంబాలను పరామర్శించారు.ఆనంతరం రాయికల్‌లో విలేకరులతో మాట్లాడుతూ టిఆర్‌ఎస్ పాలనలో గ్రామాలు అభివృద్ధ్ది కి నోచుకోవడం లేదన్నారు.
తెలంగాణ ఏర్పడినప్పటి నుంచిగ్రామపంచాయతీలకు నిధులు మంజూరు చేయలేదని కేవలం ఉపాధి హామీ, 14వ ఫైనాన్స్ ని ధులే గ్రామాలకు మంజూరైయ్యాయని తెలిపారు. ఉపాధి హా మీ, 14వ ఫైనాన్స్ నిధులు కేంద్రం మంజూరు చేసిందని గుర్తు చేశారు. నిధులు లేకుండా గ్రామాల్లో అభివవృద్ధి ఏలా జరుగుతుందని విమర్శించారు.
తెలంగాణ ప్రభుత్వం హామీలతోనే పాలన సాగిస్తుందని చె ప్పుతూ ఈ హామీలు అమలైతే బంగారు తెలంగాణ సాధ్యపడుతుందని తెలిపారు.బిజెపి కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లాలని కో రారు. పార్టీని గ్రామా గ్రామాన పటిష్టపరిచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో బిజెపి విజయం సాధించడం తథ్యమని జోస్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో బిజెపి మండలశాఖ అధ్యక్షుడు తురగ శ్రీదర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కుర్మ మల్లారెడ్డి, నాయకులు కుర్మ నారాయణరెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ సిరికొండ శ్రీనివాస్, మ ండలశాఖ ప్రధాన కార్యదర్శి అన్నవేని వేణు, భూపతిపూర్ గ్రా మశాఖ అద్యక్షులు తిప్పిరెడ్డి రాజశేఖర్, కార్యదర్శి కెజి రాం, నాయకులు ఏనుగు ముత్యం,రంజిత్, సంకోజి శేఖర్, బోగ భూ మయ్య,గంగాధర్, శేఖర్, ఇద్దం సుధీర్, వినోద్, మహేశ్, నర్స య్య తదితరులు పాల్గొన్నారు.
మృతుల కుటుంబాలకు పరామర్శ
మండలంలోని భూపతిపూర్ గ్రామానికి చెందిన బొడ్డుపెల్లి రాజేంధర్ తల్లి ఇటీవల మృతి చెందగా వారి కుటుంబసభ్యుల ను రవీందర్‌రెడ్డి, ఇతర బిజెపి నేతలు పరామర్శించారు. బండి కిష్టయ్య, వాసాల భూమయ్యల కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. రామాజీపేట గ్రామానికి చెందిన సింగిల్‌విండో డైరెక్టర్ ఇద్దం నర్సారెడ్డి ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు..

Comments

comments