Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

పాత్రధారులు సరే…మరి సూత్రధారులేరి?

criminals* అసలు దోషులకు అందలం..అనామకులకు రిమాండ్
* నకిలీ అనుమతుల కేసులో కీలక మలుపు
* అధికార పార్టీ నేతలను తప్పించారని ఆరోపణలు
* పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు
* పదకొండు మందిపై కేసు…ఏడుగురి అరెస్టు

మనతెలంగాణ/అమీన్‌పూర్/రామచంద్రాపరం : కొండను త వ్వి ఎలుకను పట్టినట్లు ఉంది అమీన్‌పూర్ పోలీసుల తీరు. అమీన్‌పూర్ సంచలనం స్పృష్టించిన నకిలీ ఇంటి అనుమతుల కేసు లో పోలీసుల తీరు వాస్తవాలకు పూర్తి భిన్నంగా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. అధికార పార్టీకి చెందిన కీలక నేతలను తప్పించి అనామకులను బలిచేస్తున్నారన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. దాదాపు ఐదుగురు కీలక నేతలు ఈ కేసులు ఉన్నప్పటికీ కేవలం ఒకేఒక్క ఎంపిటి సి అనిల్‌పై మాత్రమే కేసు నమోదు చేశారని స్థానికులు గుసగుసలాడుతున్నారు. అంతేకాకుండా ముఖ్యులను వదిలేసి అనామకులైన ఏడుగురిని మాత్రమే అరెస్టు చేసి రిమాండ్ తరలించడం పోలీసుల తీరుపై చేస్తు న్న విమర్శలకు మరింత బలాన్ని చేకూర్చుతుంది. అంతేకాకుండా అసలు సూత్రధారులను కాకుండా ఇంటి అనుమతులు పొందిన చిన్నపాటి బిల్డర్ (మేస్రి)ని తొలిముద్దాయిగా చేర్చడంపై పోలీసుల తీరు ఎలాంటిదో ఇట్టే అర్థం చేసుకోచ్చు. స్థానికంగా జరుగతున్న ప్రచారానికి పోలీసులు చెబుతున్న మాటలకు వాస్తవాలు మరోలా ఉన్నాయి. వివరాల్లోకి వెళితే…సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ గ్రామ పరిధిలో కొందరు ప్రజాప్రతినిధులు, మాజీ పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ కారోబార్‌లతో సహా మరికొందరు వ్య క్తులు మధ్యవర్తులు ముఠాగా ఏర్పడి గతంలో పంచాయతీ కార్యాలయం స్టాంపులు తయారు చేసి గతంలో గ్రామ కార్యదర్శిగా పనిచేసిన సువర్ణ, దేవదాసుల సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ ఇంటి అనుమతుల పత్రాలు జారీ చేస్తున్నారు. ఒక్కో ఇంటికి లక్షానలభై రూపాయల నుండి నలభై వే ల వరకు వసులు చేస్తూ తమ అక్రమ దందాను కొనసాగిస్తున్నారు. అనుమానం వచ్చిన పంచాయతీ అధికారుల సర్వేలో తీగలాగితే డొంక కదిలినట్లు అసలు విషయం బయటపడింది. దీంతో అమీన్‌పూర్ గ్రామ కార్యదర్శి శ్రీనివాస్ పోలీలకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన అమీన్‌పూర్ పోలీసులు అనేక మందిని విచారణ చేపట్టారు. ముందుగా అమీన్‌పూర్ మండలానికి చెందిన పలువురు ముఖ్య నేతలు ఈ నకిలీ పత్రాల వ్యవహారంలో కీలకపాత్ర పోషించారని, కోట్ల రూపాయల్లో స్కాం జరిగిందని స్థానికంగా పెద్ద చర్చేజరిగింది. బయట జరుగుతన్న చర్చకు పటాపంచలు చేస్తూ కేవలం పదకొండు మందిపై కేసు నమోదు చేసి ఏడుగురు నిందితులను శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. పటాన్‌చెరు డిఎస్‌పి కార్యాలయంలో డిఎస్‌పి సీతారం వివరాలు వెల్లడించారు.
అనామకుడే తొలి ముద్దాయి..! నకిలీ అనుమతుల కేసులో అనుమతు లు పొందిన బిల్లర్‌నే తొలిముద్దాయిగా చేర్చడం పలు అనుమానాలకు తావిస్తుంది. సాధారణంగా ఏ కేసులో అయినా సూత్రధారులను ప్రధాన నిందితుడుగా చేరుస్తు కేసునమోదు చేస్తుంటారు. కాని ఈ కేసులో అధికార ఒత్త్తిడులకు తలొగ్గి ఒక అనామకుడిని ప్రధాన నిందితుడిగా నమో దు చేశారని, దీనిపై పెద్ద కుట్రే దాగుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మీడియా సమావేశంలో ప్రధాన ముద్దాయిగా పేర్కొంటున్న పెద్దురి దామోదర్ మీడియాతో అసలు విషయం చెప్పేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. దీన్నిబట్టి ఈ కేసు దర్యాప్తులో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు
అరెస్టుల్లోనూ అదేతీరు : ఈ కేసులో బిల్డర్ పెద్దురి దామోదర్, మధ్యవర్తి లింగారావు, అమీన్‌పూర్ ఎంపిటిసి అనీల్‌కుమార్, సస్పెండ్‌లో ఉన్న ఒ కప్పటి అమీన్‌పూర్ గ్రామకార్యదర్శి సోమ్‌నారాయణ, రిటైర్డ్ కార్యదర్శి తురుమలయ్య, కిష్టారెడ్డిపేట్ కారోబార్ కుంటి నర్సింలు, బిల్డరులు గుం జి శ్రీనివాస్, లక్ష్మినారాయణ, కాస ఏదుకొండలు, మహేష్, సురేందర్‌రెడ్డిలపై కేసు నమోదు చేశారు. కాని అరెస్టుల్లోను అధికార పార్టీ ఒత్తిడి ఉన్నట్లు కొట్టొచ్చినట్లు కనబడింది. కేవలం ఏడుగురిని అరెస్టు చేసి రిమార్‌డుకు తరలించిన పోలీసులు ఎంపిటిసి అనీల్‌కుమార్, కార్యదర్శి సోమనారాయణ, లింగారావును అరెస్టు చేయకపోవడంలో అంతర్యంమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు మాత్రం దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని చెపుతున్నప్పటికీ ఏం జరుగుతుందో వేచిచూడాలి.

Comments

comments