Search
Thursday 19 April 2018
  • :
  • :
Latest News

కోలాటం ఆటలు పండగ వాతావరణాన్ని నెలకొల్పుతాయి

sarees
మనతెలంగాణ/కాల్వశ్రీరాంపూర్: గ్రామాల్లో కోలాటం ఆటలు పండుగ వాతావరణాన్ని నెలకోల్పుతున్నాయని వైస్ ఎంపీపీ కొనుకటి మల్లారెడ్డి పేర్కొన్నారు.శుక్రవారం మండలంలోని గంగారంలో గరుడ ఆంజనేయస్వామి కోలాటం బృందం 30 మంది మహిళలకు ఎంపీపీ గోపగాని సారయ్యగౌడ్ ఉచితంగా పంపిన చీరలను మల్లారెడ్డి అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోలాటం ఆటలు మహిళలకు సమిష్టిగా ఏర్పడడానికి,తాతతమ్యాలు లేకుండా ఒకేవేదికగా కలిసి ఆడుకోవడానికి దోహదపడుతున్నాయన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మత్సశాఖ జిల్లా డైరెక్టర్ రేకుల చిన్నరఘు రూ॥ 3 వేలు,ఈర్ల ఓదెలు సౌండ్ సిస్టమ్ ఖర్చులు,గరిగంటి రాజయ్య రూ॥ 2వేలు,ఈర్ల సమ్మయ్య టెంట్ ఖర్చులు,గుడ్ల సంపత్ ఒకవేయి,దామమొండి కోలలు,ఈర్ల రాజయ్య కొబ్బరికాయలు,సహాయం అందించారు.నాయకులు అంబాల రాజేందర్,ఈర్ల పద్మ,నేదురు రమేష్,కుందేల్ల సత్యం,మాస్టార్,ఎంబాటి రవి,తదితరులు పాల్గొన్నారు.

Comments

comments