Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

శివారు ప్రాంత చిన్నారుల సౌకర్యార్థం క్రికెట్ అకాడమీ

laxman

*టీం ఇండియా మాజీ ఆటగాడు వివిఎస్ లక్ష్మణ్
*రిక్వెల్ ఫోర్డ్ స్కూల్‌లో వివిఎస్ స్పోర్ట్ అకాడమీ ప్రారంభం
*హైదరాబాద్‌లో మూడవ అకాడమీ

మన తెలంగాణ/కీసర : నగర శివారు ప్రాంతాల చిన్నారుల సౌకర్యార్ధం  రిక్వెల్ ఫోర్డ్ ఇంటర్నేషల్ స్కూల్‌లో క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేసినట్లు టీం ఇండియా మాజీ ఆటగాడు, అర్జున అవార్డు గ్రహీత వివిఎస్ లక్ష్మణ్ తెలిపారు. శుక్రవారం రాంపల్లిలోని రిక్వెల్ ఫోర్డ్ ఇంటర్నేషల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన వివిఎస్ స్పోర్ట్ అకాడమీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ఇప్పటికే అజీజ్‌నగర్‌లోని శ్రీనిధి స్కూల్‌తో పాటు నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో క్రికెట్ అకాడమీలు నిర్వహిస్తుండగా, శివారు ప్రాంతాల నుంచి వస్తున్న పిల్లల ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు మూడవ అకాడమీని రిక్వెల్ ఫోర్డ్‌లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రిక్వెల్ ఫోర్డ్ యాజమాన్యం భాగస్వామ్యంతో అకాడమీ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఇక్కడ ఉన్న సౌకర్యాల దృష్టా క్రికెట్ అకాడమీ ఏర్పాటుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఈనెల 22 నుంచి సాయంత్రం 3.30 గంటల నుంచి 7.30 వరకు రెండు బ్యాచ్‌లుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అంతకు ముందు విద్యార్ధులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించిన ఆయన విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. మైదానంలో చిన్నారులకు క్రికెట్ మెలకువలు నేర్పారు. పాఠశాల డైరెక్టర్ విద్యా స్రవంతి మాట్లాడుతూ క్రీడలలో విద్యార్ధులకు తల్లిదండ్రుల ప్రోత్సాహం అవసరమని అన్నారు. విద్యార్ధులకు క్రికెట్ పట్ల ఉండే ఆసక్తి దృష్టా రిక్వెల్ ఫోర్డ్‌లో వివిఎస్ క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శివారు ప్రాంతాల ప్రజలకు ఈ అకాడమి ఎంతో సౌకర్యాంగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఉదయ్‌కుమార్, ఉపాధ్యాయులు, క్రికెట్ శిక్షకులు పాల్గొన్నారు.

Comments

comments