తిరుపతి: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది. సంక్రాంతి నేపథ్యంలో తిరుమలకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 28 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉంటున్నారు. స్వామివారి దర్శనానికి సుమారు 7 గంటల సమయం పడుతుంది. శనివారం సాయంత్రం వరకు స్వామివారి హుండీ ఆదాయం రూ.1.81 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు తెలిపారు. కాగా, సంక్రాంతి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది.