Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

భారజల కర్మాగారంలో విషవాయువు లీక్

ph

 ఉద్యోగి మృతి

అశ్వాపురం: ఖమ్మం జిల్లా అశ్వాపురం మండలం మిట్టగూడెం వద్ద గల భారజల కర్మాగారంలో శనివారం విషవాయువులు ప్రసరించి ఉద్యోగి వెంకటరమణ మృతిచెందారు. మండలంలోని మొండికుంట గ్రామానికి చెందిన వెంకటరమణ (38) విధులు నిర్వర్తిస్తుండగా హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువు లీక్ అయింది. తోటి ఉద్యోగులు అశ్వాపురంలోని ఆసుపత్రికి చికిత్స కోసం తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. కర్మాగారం జిఎం ఆసుపత్రికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లనే వెంకటరమణ ప్రాణాలుకోల్పోయాడని ఆయన బంధువులు ఆసుపత్రి బయట ఆందోళన నిర్వహించారు. సమాచారం అందుకున్న అశ్వాపురం సిఐ ఆలం నరేందర్ సిబ్బందితో అక్కడి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకుని ఆందోళనను విరమింపజేశారు. భారజల కర్మాగార అధికారుల నిర్లక్షమే వెంకటరమణ మృతికి కారణమని, ప్రభుత్వం భారజల కర్మాగార అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో మొండికుంట, మల్లెలమడుగు గ్రామాలలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

Comments

comments