Search
Wednesday 24 January 2018
  • :
  • :
Latest News

నిర్లక్ష్యంతో ఇంజనీర్ విద్యార్థి మృతి

hatya
మనతెలంగాణ/ నిజామాబాద్‌క్రైం ః నగరంలోని కంఠేశ్వర్‌లో నిర్లక్ష్యంతో ఇంజినీర్ విద్యార్థి మృతి చెందాడు. గురువారం ఉదయం నిజామాబాద్ నుండి ఆర్మూర్ వైపు వెళ్తున్న ఆర్‌టిసి బస్సులో ప్రయాణిస్తున్న క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ నాల్గవ సంవత్సరం చదువుతున్న విద్యార్థి మదన్ (23) ప్రమాదవశాత్తు కాలుజారీ తాను ప్రయాణిస్తున్న బస్సు నుండి పడి బస్సు వెనక టైర్ల కిందపడి మృతిచెందిన ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ ఆదర్శనగర్‌కు చెందిన దేవిదాస్ మమతల ఏకైక కుమారుడు మదన్ (23) రోజులాగే కాలేజికి వెళ్లే క్రమంలో గురువారం కంఠేశ్వర్ ఆలయం వద్ద ఆర్మూర్ డిపో బస్సు ఎపి25జడ్ 0078 ఎక్కిన కొద్దిసేపటికి ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు ఎక్కిన సదరు విద్యార్థి బస్సు పుట్‌బోర్డు వద్ద నిలబడడంతో కాలు జారీ వెనక టైర్ల కిందపడి మృతి చెందాడు. మృతిచెందిన మదన్‌ను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు 3వ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై క్రిష్ణ తెలిపారు. ఈ సందర్బంగా అతనితో ప్రయాణిస్తున్న స్నేహితులు షాక్‌కు గురయ్యారు. గత మూడు సంవత్సరాలుగా తమతో పాటే ప్రయాణిస్తున్న స్నేహితుడు ఇకలేడు అని కన్నీరుమున్నీరయ్యారు. అందరితో చలకిగా ఉంటూ అందరిని నవ్వించేవాడని, చదువులో కూడా మంచి ప్రతిభ కనబరిచే వాడని వారు తెలిపారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సంఘటన స్థలం వద్ద బోరున విలపిస్తూ ఏడుస్తున్న తీరును పలువురిని హృదయాన్ని కలిచివేసింది.

Comments

comments