Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

నిత్య జాతీయ గీతం ఆలాపన ప్రారంభం

salute

మనతెలంగాణ/ కోరుట్ల:  దేశభక్తిని పెంపొందిచడానికి కోరుట్ల పట్టణ కిరాణ వర్తక సంఘం చేపట్టిన నిత్య జనగణమన (జాతీయ గీతము) ఆలాపన కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 10 గంటలకు స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు జాతీయ పతాకం ఆవిష్కరించి ప్రారంభించారు. పట్టణంలోని జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన 101 జాతీయ పతాకాలను అధికారులు, నాయకులు, పుర ప్రముఖులు అవిష్కరించి జాతీయ గీతాన్ని సామూహికంగా ఆలాపించారు. కాగా ప్రతి రోజు ఉదయం 9 గంటలకు జనగణమన (జాతీయ గీతము) ఆలాపించడానికి  రహదారిపై 30 మైకులు అమర్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కులమతాలకు అతీతంగా జాతీయ భావాన్ని పెంపొందిచుకొవడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టిన కిరాణ వర్తక సంఘం నాయకులను, సభ్యులను అభినందించారు. దేశంలో మొదటి సారి 101 జాతీయ జెండాలను ఆవిష్కరించిన ఈ కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ వ్యవస్థాపకులు డా॥ చింతపట్ల వెంకటాచారి సర్టిఫికెట్‌ను వర్తక సంఘ అధ్యక్ష కార్యదర్శులు చిద్రాల అశోక్, సంతోష్‌లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్‌పి మల్లారెడ్డి,మున్సిపల్ చైర్మన్ శీలం వేణుగోపాల్, కౌన్సిలర్లు, అధికార్లు, వివిధ సంఘాల నాయకులు, పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Comments

comments