Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

కరెంట్ షాక్ తో రైతు మృతి

accident

*పంటలకు రక్షణగా అమర్చిన విద్యుత్ తీగలకు రైతు బలి

మనతెలంగాణ/నర్సాపూర్:
మండలంలోని జామ్ని గ్రామంలో దేవోల్ల పోతన్న(65) అనే రైతు విద్యుత్ షాక్‌తో మృతి చెందినట్లు ఎస్‌ఐ రామ్‌నర్సింహారెడ్డి తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం అడవి పందుల బారి నుంచి పంట రక్షణ నిమిత్తం పంట చేను చుట్టూ విద్యుత్ తీగలను అమర్చాడని శుక్రవారం ఉదయం వాటిని తొలగించేందుకు వెళ్లిన పోతన్న తాను ఏర్పాటు చేసుకున్న విద్యుత్ తీగలు తగిలి షాక్‌కు గురై మృతి చెందినట్లు పేర్కొన్నారు. పోతన్నకు నలుగురు పిల్లలు, భార్య ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Comments

comments