Search
Sunday 21 January 2018
  • :
  • :
Latest News

రైతుల సంక్షేమమే టిఆర్‌ఎస్ ధ్యేయం

trs

మనతెలంగాణ/రుద్రూర్(బోధన్): రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అహర్నిషలు కృషి చేస్తుందని రుద్రూర్ మండల టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్ పేర్కొన్నారు.  సోమవారం రైతులకు నిరంత రాయంగా 24 గంటల పాటు  విద్యుత్  సరఫరాను  ప్రారంభించడంతో సంబరాలు నిర్వహించడంతో మండల కేంద్రంలో రైతులు సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ రైతుల కంట కన్నీరు పెట్టించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెంపపెట్టులాంటిదన్నారు. గతంలో కాం గ్రెస్ పార్టీ నాయకులు అధికారంలో ఉన్నప్పడు రైతులకు సక్రమంగా విద్యుత్ సరఫరా చేయకపోవడంతో పంటలు ఎండి అప్పుల పాల య్యారని గుర్తు చేశారు. రైతుల శ్రేయస్సును కోరే ముఖ్యమంత్రి కేసీఆర్ చిరకాలం ఆయురారోగ్యాలతో వర్దిల్లాలని కోరుకున్నారు. రైతుల సమస్యలను ఆహర్నిషలు కష్ట పడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి రైతుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్ విండో చైర్మన్ పత్తి రాము, నీటి సంఘం మాజీ అధ్యక్షులు నాగేందర్, రుద్రూర్ ఉపసర్పంచి నర్స య్య,  టిఆర్‌ఎస్ పార్టీ కార్యదర్శి తోట్ల గంగారాం, సులేమాన్ పారం గ్రామ పార్టీ అధ్యక్షులు కరీం, గొల్ల కుర్మ సంఘం అధ్యక్షులు సాయిలు, ఓ సాయన్న, రుద్రూర్ మండల యువజన సంఘం అధ్యక్షులు లాల్ మహ్మద్ తదితరులు ఉన్నారు

Comments

comments