Search
Saturday 20 January 2018
  • :
  • :
Latest News

కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై పోరాటం

cpi

* సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి

మన తెలంగాణ/రామకృష్ణాపూర్  తెలంగాణ రాష్ట్రంలోని కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై  సిపిఐ ఆధ్వర్యంలో  దశల వారి పోరాటం చేస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం  సిపిఐ జిల్లా సమితి కౌన్సిల్  కార్యవర్గ సమావేశానికి  హజరవుతున్న ఆయనకు పట్టణ పార్టీ మండల నాయకులు ఘన స్వాగతం ఫలికారు.సిపిఐ  పట్టణ  కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్, మండల కార్యదర్శి రామడుగుల లక్ష్మణ్‌లు  పుష్పగుచ్చం అందజేసి,  నూతన సంవత్సర శుభాకాంక్షలుతెలిపారు. అనంతరం  విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న  కార్మిక వ్యతిరేక  విదానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  ఎంపిటిసి వనం సత్యనారాయణ,  వార్డు సభ్యులు తీగలరమేష్, నాయకులు అక్బర్ అలీ,  లింగయ్య,  రాస సంపత్, సదానందం పాల్గొన్నారు

Comments

comments