Search
Saturday 21 April 2018
  • :
  • :

ఐ.టి.సి గొదాంలో అగ్ని ప్రమాదం

fireaccident
15 లక్షల ఆస్తి నష్టం
మన తెలంగాణ / ఆర్మూర్ రూరల్‌ః ఆర్మూర్ మండలం మామిడిపల్లి గ్రామ పరిధిలోని గొవింద్‌పెట్ రొడ్డు నందు గల ఐ.టి.సి గొదాంలో మంగళవారం వెకువ జామున అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 15 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు గొదాం యాజమాని రవిందర్ గౌడ్ తెలిపారు. గత 16 నెలల క్రితం ఐ.టి.సి కంపెనీకి సంబందించిన ఎజెన్సీని తీసుకోని ఓం ఎంటర్‌ప్రైజెస్ పేరిట నిర్వహించడం జరుగుతుందని, రోజువారిగానే సోమవారం రాత్రి తాళలు వేసి తాము ఇంటికి వెళ్లినట్లు ఆయన పేర్కోన్నారు. మంగళవారం వెకువజామున గొదాంలో మంటలు చెలరెగినట్లు స్థానికులు తనకు సమాచారం ఇచ్చారని హుటహుటిన తాను గొదాం వద్దకు వచ్చేసారికి గొదాంలో ఉన్న సరుకు సగ భాగం కాలి బూడిదయినట్టు ఆయన అన్నారు. స్థానిక అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగ వారు వచ్చి మంటలను ఆర్పినట్లు రవిందర్ గౌడ్ వివరించారు. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియడంలేదని ఆయన అన్నారు.

Comments

comments