Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

కులవృత్తుల అభ్యున్నతికి ప్రభుత్వం చేయూత

wgl

నర్సింహులపేట: కనుమరుగువుతున్న కులవృత్తుల అభ్యు న్నతికి ప్రభుత్వం చేయూతనిస్తుందని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ అన్నారు.ఆదివారం మండలంలోని పెద్దనాగారంలో 24 యూని ట్లను గొల్ల కురుమాలకు గొర్రె పిల్లలను పంపిణీచేశారు.ఈ సందర్భంగా సర్పంచి కొమ్ము ఉపేంద్ర అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మె ల్యే రెడ్యా నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణను బంగారు తెలంగాణగా చేయాలని మరుగునపడిన కులవృత్తులను కాపా డ టం కోసమే 5వేల కోట్లను కేటాయించి సబ్బండ కులాలను ఆదుకున్న ఘనత కేసీఆర్‌దేనన్నారు.దేశంలో ఏరాష్ట్రంలోనూ అమలు పరచని సంక్షే మపథకాలు ప్రవేశపెట్టిందని,తెలంగాణరాష్ట్రంలో 35లక్షలమంది యాద వ సోదరులు ఉన్నారని వారి అభ్యున్నతికోసం ప్రభు త్వం 4లక్షల గొర్రెల యూనిట్లను పంపిణీ చేస్తుందని అందులో భాగంగా డోర్నకల్ నియోజక వర్గంలో 7వేల మంది యాదవ సోదరులు ఉండగా ఇప్పటి వరకు 3600 మందికి గొర్రెలను ఒక యూనిట్‌కు రూ.లక్ష20వేలు విలు వ చేసే గొర్రెల ను అందించడం జరిగిందన్నారు.వచ్చే సంవత్స రం ఖరీప్ నాటికి డొర్న కల్ నియోజకవర్గంలోకి కాళేశ్వరం నీటిని తెప్పించి రైతుల ను పూర్తిగా ఆదుకుంటానన్నారు.నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ప్రతి తండాకి తారు రోడ్లు కల్పించడం జరిగిందన్నారు.ఈ కార్యక్ర మంలో టిఆర్‌ఎస్ డోర్నకల్ యూవజన నాయకుడు రవిచంద్ర, ఎంపిపి సంపెట సుజాత రాము, జేడ్పిటిసి వేణు, టిఆర్‌ఎస్ మండల పార్టిఅధ్యక్షులు టెకుల యాద గిరి రెడ్డి, పిఎసిఎస్ ఛైర్మన్ మైదం దేవేందర్ ఎంపిటిసిలు నాయకి, వెంక ట లక్ష్మీ,జిల్లానాయకులు సంపెట రాము, వెటర్నరి డాక్టర్ వినోద్,  సర్పం చుల ఫోరం మండలధ్యక్షులు దామోదర్ రెడ్డి, ఎస్పి సేల్ మండల అధ్యక్షుడు ఎల్లయ్య, ఎస్టీసేల్ మండధ్యక్షుడు సంజీవ,రైతు సమి తి జిల్లా సభ్యుడు తొటసురేష్,గ్రామపార్టీఅధ్యక్షులు అమృతారెడ్డి,టిఆర్‌ఎస్ నాయకులు ప్రవీణ్, సర్పంచులు ఎంపిటిసి సభ్యలు   పాల్గొన్నారు.

Comments

comments