Search
Saturday 21 April 2018
  • :
  • :

వెనుకబడిన కులాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

collector

*వీడియో కానరెన్స్‌లో ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం

మన తెలంగాణ/కామారెడ్డి: వెనుకబడిన కులాల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. రాబోయే పది రోజుల్లో నాయీ బ్రాహ్మణ, వాషర్‌మెన్,యంబిసి, విశ్వబ్రాహ్మణులకు ప్రభుత్వం ద్వారా సబ్సిడీ నిధుల ను మంజూరు చేస్తున్నామన్నారు. జిల్లాస్థాయిలో అర్హుల జాబితాను సిద్ధంగా ఉంచాలని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలను జిఎస్ మ్యాప్ ద్వారా సులువుగా గుర్తి ంచేలా జిల్లా స్థాయిలో ప్రాచుర్యం నిర్వహించాలన్నారు. కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను పెండ్లీ రోజునే అందించడానికి ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి 15 రోజులకు సమీక్షాసమావేశం నిర్వహించాలన్నారు. బిసి శాఖ ద్వారా (ఓవర్‌సిస్) మనతెలంగాణ/నిజామాబాద్ బ్యూరో
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని వెనుకబడిన కులాల ఆర్థిక అభివృద్ది 746 మంది లబ్దిదారులకు ఆర్థిక సహాయం అందించాలని లక్షం కాగా అందులో 471 మంది లబ్దిదారులకు గ్రౌండింగ్ చేయడం జరిగిందని మిగతా 271 మంది గ్రౌండింగ్ చేయాలని, జిల్లా కలెక్టర్ రామ్మోహన్‌రావు వెల్లడించారు. శుక్రవారం బిసి సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరి వెంకటేశం, కమీషనర్ అనిత రాజేంద్ర కలిసి బిసి సంక్షేమ శాఖ అమలు చేస్తున్న పథకాలను జిల్లా కలెక్టర్లకు వీడియో కాన్సరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రామ్మోహన్‌రావు మాట్లాడుతూ 2015—..16 ఆర్థిక సంవత్సరంలో ఎంపిక చేసిన 746 లబ్దిదారుల్లో ఇంకా 271 మందికి ఆర్థిక సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండు కోట్ల 58 లక్షలు రూపాయల సబ్సిడి మంజూరు చేసినప్పటికీ ఇంకా కొన్ని బ్యాంకుల్లో అట్టి మొత్తం జమ కాలేదని బ్యాంకర్లు చెబుతున్నారని కలెక్టర్ వారికి వివరించారు. గ్రౌండింగ్ చేసేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వివరించారు.
కళ్యాణలక్ష్మి చెక్కులను పెళ్లిరోజే అందించాలి
కళ్యాణ లక్ష్మి చెక్కులను పెళ్లిరోజే అందిస్తేనే నిరుపేదలకు ప్రయోజనం కలుగుతుందని పెళ్లి అయిపోయిన తర్వాత చెక్కులనున అందజేస్తున్నారని ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేస్తున్నారని ప్రభుత్వం లక్షం కూడా. పెళ్లికి రెండు, మూడు రోజుల ముం దుగా పెళ్లిరోజేనే అందించేందుకు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో జిఓ ఏవైన చేర్పులు, మార్పులు చేసి చెక్కుల పపిణీ సర్వే సమయంలో అందించేందుకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తామని బిసి సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరి వెంకటేశం చెప్పారు. గతంలో రద్దు పరిచిన దరఖాస్తులను తిరిగి పరిశీలన చేసి అర్హులకు అందజేయాలన్నారు.
లబ్ద్ధిదారుల మాస్టర్ జాబితా సిద్ధం చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం రానున్న రోజుల్లో బిసి, ఓబిసి సంక్షేమానికి పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలను నిధులను వెచ్చించే అవకాశం ఉన్నందున రజక, నాయిబ్రహ్మణ, విశ్వకర్మల లబ్దిదారులను జాబితాను ఈ నెల 20లోగా సిద్దం చేయాలని ఆదేశించారు. మండలంలో అన్ని గ్రామాల నుండి అర్హుల జాబితా తయారు చేసుకొని పంపిణీ చేసే సందర్బంలో మాస్టర్ జాబితాను తొలగించాలని డూప్లికేట్ ఉండకుండా ఉంటుందని చెప్పారు.
రజక, నాయిబ్రహ్మణ పెడరేషన్ల ఆన్‌లైన్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైనందున అందరు పెడరేషన్ వారు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌లో చేయించుకోవాలని చెప్పారు. నేటి యువత ఒక రకమైన ఆందోళనలో ఉన్నందున వారిని ఆందోళన నివృత్తి చేసేందుకు పోటీ పరీక్షలో పార్టీ విధంగా చర్యలు తీసుకోవాలని పాత జిల్లా ఒక్కటి బిసి స్టడీ సర్కిల్, మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విదేశాలలో చదువుకునే ఆసక్తి గల వారందరికి రాష్ట్ర ప్రభుత్వ ఓవర్సిస్ విద్యా నిధి పథకం ద్వారా ఆసక్తి గల వారందరికి సహాయం అందించబడునని ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. బిసి రెసిడెన్షియల్ పాఠశాలలకు ప్రైవేట్ వ్యక్తుల భవనంలో అద్దె ఉంటున్నందున అద్దె నిర్ణయించి నివేదిక పంపించాలన్నారు. పక్క భవనాల నిర్మాణానికి 10 ఎకరాల స్థలం అందిస్తే భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. ఈ వీడియో కాన్పరెన్స్‌లో బిసి సంక్షేమాధికారి విమలదేవి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments