Search
Saturday 20 January 2018
  • :
  • :
Latest News

రైతుల కష్టాలను పట్టించుకోని ప్రభుత్వం

hand

మనతెలంగాణ/చిట్యాల: రైతులు పంటలు పండక అనేక రకాలుగా తీవ్ర ఇబ్బందులుపడుతున్నా కనీసం వారిని పలకరించి, వారి సమస్యలను పట్టించుకున్న వారే లేరని కాంగ్రెస్ మాజీ చిప్‌వి ప్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని నైన్‌పాక, వరికోల్‌పల్లి, కొత్తపల్లి గ్రామాలలో మన ఊరుకు మన గండ్ర రమణన్న కార్యక్రమంలో భాగంగా రమణారెడ్డి పర్యటించా రు. ఈ సందర్భంగా రమణారెడ్డికి రైతులు మా సమస్యలను ఈ ప్రభుత్వం  పట్టించుకోవడంలేదని మేం ఆరుగాలం పండించిన పంటలు సరిగ్గా పండక, పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బం దులు పడుతున్నామన్నారు. రైతులు ఏం చేయాలో దిక్కుతోచక దిగాలుపడి, చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నా  కనీసం పలకరించి న దాఖలాలులేవని రైతులు ఆయనకు విన్నవించా రు. దీంతో గండ్ర వెంకట రమణారెడ్డి మట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రైతులకు మేలు జరిగిందని, రైతుల కష్టాలు తీర్చే పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. కెసిఆర్ ప్రభుత్వంలో ఒక్క రైతు సుభిక్షంగా లేడని, విద్యార్థులు, నిరుద్యోగులు  అనే క అవస్థలుపడుతున్నారని, రానున్నరోజులలో టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి రైతులు తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. నైన్‌పాక, వరికోల్‌పల్లి, కొత్తపల్లి గ్రామా ల రైతులతోపాటు అక్కడి ప్రజలను వారి సమస్యల పై అడిగి తెలుసుకున్నారు. కెసిఆర్ ఎన్నికల ముం దు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చడంలో విఫలమ య్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పా ర్టీ మండల అధ్యక్షులు గొర్రె సాగర్, ప్రధాన కార్యద ర్శి  పర్లపెల్లి భద్రయ్య, చిలువెరు సంతోష్, బిక్కనూరి సుదర్శన్, పెండెం సర్వెశం, పాశం కుమార్, దామరశెట్టి సతీష్, అకునారి ప్రభాకర్, పంచిక అశోక్, నాగుల సాంబయ్య, తొట్ల అయిలయ్య, కల్వచర్ల సాంబయ్య, మెండు రవీందర్, దేవేందర్‌రెడ్డి, రాంరెడ్డి, సంపత్‌రెడ్డి, తోట్ల రవి, శ్రీపతి తిరుపతి, పెండెల సంజీవ్, సావటి రవి పాల్గొన్నారు.

Comments

comments