Search
Sunday 21 January 2018
  • :
  • :
Latest News

ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం

photo

మనతెలంగాణ/టేకుమట్ల: ప్రభుత్వం ప్రజావ్యతిరేక పాలన అవలంబిస్తూ  ప్రజాసంక్షేమాన్ని విస్మరించిందని మా జీ చీప్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం భూపాలపల్లి నియోజకవర్గంలోని మండలం రామకిష్టాపూర్ (వి), వెలిశాల గ్రామాల్లో  ఇంటింటి రమణన్న కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు నిర్వహించగా ముఖ్యఅతిథిగా రమణా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రామాల్లోని అన్ని వాడల్లో  కలియతిరుగుతూ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయా గ్రామాల్లో ప్రజలనుద్దేశించి గండ్ర మాట్లాడుతూ రాష్ట్రంలో కేసిఆర్ నిజాంను మరిపించేలా కుట్రపూరితమైన పాలన కొనసాగిస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని తుంగలోతొక్కి తుగ్లక్ పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. మూడున్నర సంవత్సరాల్లో తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం ఒరగబెట్టింది శూన్యమని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణలోని అన్ని గ్రామాలు, నియోజకవర్గంలోని ప్రతి పల్లె అభివృద్ధి జరిగిందని, నా హయాంలోనే ఈ ప్రాంతం అన్ని రంగాల్లో ప్రజా సమస్యలను పరిష్కరించి కృషిచేశానని తెలిపారు. 2019ఎన్నికల్లో కెసిఆర్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పి, తెలంగాణలో కాంగ్రెస్ ప్ర భుత్వానికి బాటలు వేస్తారని వెల్లడించారు. అనంతరం ఆయా గ్రామాల్లోని ఇటీవల మృతిచెందిన బాధిత కుటుంబాలను రమణారెడ్డి పరామర్శించి ఓ దార్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి సట్ల కొమురయ్య, కాంగ్రెస్ మండలపార్టీ అధ్యక్షులు రెడ్డి మల్లారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ పెరుమాండ్ల మొగిలి, ఉపాధ్యక్షులు అంబర బాబురావు, ప్రధాన కార్యదర్శి బిక్కినేని సంపత్‌రావు, గువ్వాడి లక్ష్మణ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎండీ అక్రమ్, కుమార్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments