Search
Friday 20 April 2018
  • :
  • :

కొండలను మింగేస్తున్నారు..

stone

*అనుమతులు కొంత.. తవ్వుతున్నారు కొండనంతా..
*ప్రాంతీయ చరిత్రను ప్రశ్నార్థకం చేస్తున్న ఘనులు
*నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు
*గుట్టలు సైతం కానరాని అధికారులు

కరిగించేందుకు కాదేదీ అనర్హం అన్న చందంగా జిల్లాలోని కొండల పరిస్థితి దారుణంగా మారింది. ఎత్తయిన కొండలు, గుట్టలు ప్రాంతీయ చరిత్రకు ఆనవాళ్లు. అయితే వాటి జాడ, ఉనికే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతోంది. కాసుల కక్కుర్తి, అధికారుల అలసత్వం… వెరసి అక్రమార్కుల పంట పండుతోంది. వేలాది ఎకరాల్లో ఉన్న కొండలను కరిగించేందుకు క్వారీల అనుమతులు పొందుతూ దోచేసుకుంటున్నారు. ఇప్పటికే పెంచుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఓ వైపు ప్రభుత్వమే లక్షాలు నిర్ధేశించడంతో ఏమి చేయాలో అర్ధంకాని స్థితిలో పలువురు అధికారులున్నారు.జిల్లాలో గ్రానైట్ క్వారీలు 55 ఉన్నాయి. రోడ్డు, కంకర క్వారీలు 65 వరకు ఉన్నాయి. ఈ వ్యాపారంలో అధిక లాభాలు ఉండటంతో జిల్లాలో కొత్తగా గ్రానైట్ క్వారీల ఏర్పాటుకు దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. దీంతో పాటు కంకర క్వారీల నిర్మాణానికి పెద్ద ఎత్తునే దరఖాస్తులు వస్తుండడంతో వాటిని అధికారులు పరిశీలిస్తున్నారు. గ్రానైట్ 10, కంకర క్వారీలు 10 వరకు పెండింగ్‌లో ఉన్నాయి.  కరిగించేందుకు కాదేదీ అనర్హం అన్న చందంగా జిల్లాలోని కొండల పరిస్థితి దారుణంగా మారిం ది. జిల్లాలోని కొండల దుస్థితి. ఎత్తయిన కొండ లు, గుట్టలు ప్రాంతీయ చరిత్రకు ఆనవాళ్లు. అయితే వాటి జాడ, ఉనికే ఇప్పుడు ప్రశ్నార్థకం గా మారుతోంది. కాసుల కక్కుర్తి, అధికారుల అలసత్వం… వెరసి అక్రమార్కుల పంట పండుతోంది. వేలాది ఎకరాల్లో ఉన్న కొండలను కరిగించేందుకు క్వారీల అనుమతులు పొందుతూ దోచేసుకుంటున్నారు. ఇప్పటికే పెంచుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది లా ఉండగా ఓ వైపు ప్రభుత్వమే లక్షాలు నిర్ధేశించడంతో ఏమి చేయాలో అర్ధంకాని స్థితిలో పలువురు అధికారులున్నారు.
జిల్లాలో గ్రానైట్, రో డ్డు కంకర క్వారీలు, ఏర్పాటు చేసి కొండల ను దోచుకుంటున్నా రు. కంకర, గ్రానైట్ క్వారీల పేరుతో కొం డలను కరగదీస్తున్నా రు. ఇప్పటికే జిల్లాలో గ్రానైట్ క్వారీలు 55 ఉన్నాయి. రోడ్డు, కంకర క్వారీలు 65 వరకు ఉన్నాయి. ఈ వ్యాపారంలో అధిక లాభాలు ఉండటంతో జిల్లాలో కొత్తగా గ్రానైట్ క్వారీల ఏర్పాటుకు దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. దీంతో పాటు కంకర క్వారీల నిర్మాణానికి పెద్ద ఎత్తునే దరఖాస్తులు వస్తుండడంతో వాటిని అధికారులు పరిశీలిస్తున్నారు. గ్రానైట్ 10, కంకర క్వారీలు 10 వరకు పెండింగ్‌లో ఉన్నాయి. గ్రా నైట్ క్వారీల ఏర్పాటుకు గతంలో తహసీల్దార్ అనుమతి ఇచ్చే వారు. మూడు సంవత్సరాల నుంచి కలెక్టర్‌కు ఎన్‌ఓసి ఇచ్చే అధికారం కట్టబెట్టడంతో లీజుల మంజూ రు జాప్యమవుతోంది. కాగా ఇటీవల ప్రభుత్వం ఆదాయ మార్గాల వైపు దృష్టి సారించడంతో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్నీ పరిశీలించి అనుమతులివ్వాలని ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. గ్రానైట్ క్వారీల నిర్వాహకులు రెవెన్యూ అధికారుల అనుమతు ల కోసం ప్రజా ప్రతినిధుల నుండి ఒత్తిళ్లు తెస్తున్నారనే విమర్శలొస్తున్నాయి.
కంకర క్వారీలు ఏర్పాటు…
క్వారీల ద్వారా సన్న, దొడ్డు కంకరను తయారు చేస్తుంటారు. వీటిని పలు నిర్మాణాల కోసం ఉపయోగిస్తున్నారు. దీంతో ఈ కంకరకు డిమాండ్ బాగా ఉంది. జిల్లాలోని నూతన్‌కల్ మండలంలోని పెద్దనెమిల, చిన్న నెమిల, సింగారం గ్రా మాల్లో అనుమతి లేకుండా క్వారీలలో భారీగా తవ్వకాలు జరుపుతున్నారు. అక్కడి ప్రజలు పలుసార్లు అనుమతిలేని క్వారీలపై చర్య తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేసినా స్పం దన లేదనే ఆరోపణలున్నాయి.
గ్రానైట్ క్వారీలు
గుట్టలు, ఏనెలున్న ప్రాంతాల్లోని పెద్ద పెద్ద గుం డ్లను తరలించేందుకు క్వారీలను ఏర్పాటు చేశా రు. రాళ్ల ద్వారా ఇండ్లకు ఉపయోగించే పాలీష్ బండలు తయారు చేస్తారు. రాళ్లకు బాగా డి మాండ్ ఉండటం, విలువైన రాళ్లు కావడంతో క్వారీలను ఏర్పాటు చేసేందుకు వ్యాపారులు ముందుకొస్తున్నారు.
అనుమతులేవీ..
జిల్లాలో పర్యావరణ అ నుమతులు లేకుండా గ్రానైట్ క్వారీలు కొనసాగుతున్నట్లు విమర్శలొస్తున్నాయి. జిల్లాలో సుమారు 130 క్వారీలకు అనుమతులు ఉ న్నట్లు సమాచారం. మిగిలినవి అనధికారికంగా నిర్వహిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలొస్తున్నాయి. గ్రామ సభలు నిర్వహించి గ్రామస్తుల అభిప్రాయాన్ని తెలుసుకుంటారు. వాయు వు, శబ్ద, భూ, జీవ, పర్యావరణ, సామాజిక ఆర్థిక, పర్యావరణంపై సమగ్ర సర్వే చేపట్టి ప్రజాభిప్రాయాన్ని జాయింట్ కలెక్టర్ ఆమోదిస్తేనే పర్యావరణ శాఖ గ్రానైట్ క్వారీలకు అనుమతి ఇస్తుంది. ఇవేమి లేకుండానే కొన్ని క్వారీల యజమానులు రెవెన్యూ, మైనింగ్ పోలీస్ శాఖ అధికారులకు మామూళ్లు ఇచ్చి ప నులు చేసుకుంటున్నారనే విమర్శలొస్తున్నాయి. దీంతో జిల్లాలో గ్రానైట్ క్వారీల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది.
అనధికారికంగా క్వారీల నిర్వహణ
జిల్లాలోని 17 మండలాలలో నిల్వ ఉన్న క్వారీలలో సుమారు 70 శాతం గ్రానైట్లను, కంకరను ప్రతి రోజు సరఫరా చేస్తున్నారు. సూర్యాపేటలో 11, తిరుమలగిరిలో 2, పెన్‌పహాడ్‌లో 3, మోతె లో 1, మునగాలలో 12, కోదాడలో 10, హు జూర్‌నగర్‌లో 3, మేడేపల్లిలో 14,నూ చిలుకూ రులో 11, నూరేడుచర్లలో1, ఆత్మకూర్‌లో 1, అనంతగిరిలో 6, పాలకీడులో 2, మఠంపల్లి లో35, మేళ్ల చెర్వులో 19, చింతలపాలెం లో11లు అధికారుల రికార్డుల ప్రకారం నమోదయ్యాయి. కానీ నూతన్‌కల్, సూర్యాపేట, చివ్వెంల మండలాల్లోని కొన్ని నిల్వలలకు అనుమతులు లేకుండా గ్రానైట్ కంకర క్వారీలు నిర్వహిస్తున్నారు. గనులు, భూగర్భ శాఖల అనుమతులు లేకుండా యథేచ్చగా క్వారీలను తరలిస్తున్నారు. సుమారు సగానికిపైగా లీజుల గడువు మీరినా అధికారులు పట్టించుకోవడం లేదు. లీజులను పునరుద్దరిస్తే అధిక శాతం డబ్బులు ఖర్చవుతాయని పాత క్వారీల పేరుతో డబ్బులు దండుకున్నట్లు సమాచారం.
బాంబు శబ్ధాలకు పరుగులు పెడుతున్న ప్రజలు
గ్రానైట్ క్వారీలతో బాంబులు పెట్టి పేలుస్తుండడంతో సమీపంలోని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ముఖ్యంగా రహదారుల వెంట ఉన్న కొండలపై పేలుడు చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు కాంట్రాక్టర్లు తీసుకోకపోవడం వల్ల ప్రజలు త మ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయా ణం కొనసాగిస్తున్నారు. సమీప ప్రాంతంలోని సాగు భూములలో పని చేసుకునే రైతులు, కూలీలు బాంబుల మోతలతో ఉలిక్కిపడుతూ బ్రతుకు జీవుడాంటూ పరుగులు పెడుతున్నారు. జిలిటెన్ స్టిక్స్ నిషేధించినప్పటికీ, వాటిని వాడుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి బాంబులు పెట్టే వారిని తీసుకొచ్చి పనులు చేస్తున్నారు. దీంతో పర్యావరణానికి విఘాతం కలిగే ప్రమాదముంది. ఇప్పటికైనా మైనింగ్, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు అనుమతులు లేని గ్రానైట్ క్వారీలను అరికట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Comments

comments