Search
Wednesday 24 January 2018
  • :
  • :
Latest News

వ్యక్తిగత మరుగుదొడ్ల బిల్లులో భారీ అక్రమాలు

bammaమనతెలంగాణ/బోధన్: బోధన్ మండలంలోని పలు గ్రామాల్లోని వ్యక్తి గత మరుగుదొడ్ల నిర్మాణాల్లో భారీ అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బోధన్ మండలంలో 32 గ్రామ పంచాయతీల్లో డిఆర్‌పిలు నామమాత్రంగా విచారణలు చేపట్టడంతో పాటు పదవ సామాజిక తనిఖీల్లో అక్రమాలు వెల్లడైనా బయటకు పొక్కకుండా వ్యవ హరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సమాచార హక్కు చట్టం ద్వారా అసలు విషయాలు బట్టబయలు కావడంతో అధికా రుల్లో ప్రకంపనలు చెలరేగాయి. మనతెలంగాణ విలేకరులు చేపట్టిన  సాహసంతో  బోధన్ మండలంలోని 8 గ్రామాల్లో భారీ అక్రమాలు చోటుచేసుకున్నట్లు తేలింది. ఊట్‌పల్లి, సాలురా, ప్రెగడపల్లి, ఉన్సా, కాడ్‌గాం, పెంటకుర్ది, సంగం, అంగర్గ తో పాటు గ్రామాల్లో సైతం మరు గుదొడ్లు నిర్మించకుండానే బిల్లులు పొందినట్లు వెల్లడైంది. ఊట్ పల్లి గ్రామంలో మరణించిన వారి పేరిట సైతం బిల్లులు పొంది సిబ్బంది అక్రమాలకు పాల్పడినట్లు స్పష్టమైంది. ప్రజావేదికలో భాగంగా పిడి ఎదుట నిర్వహించిన సామాజిక తనిఖీల్లో సైతం 8 గ్రామాల్లో అక్రమా లు జరిగినట్లు తెలిసినప్పటికీ ఈ గ్రామాల అధికారులు, ప్రజాప్రతిని ధులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మండల, జిల్లాస్థాయి అధికారుల తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుమారు రెండు కోట్లకు పైబడి అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్రామాల్లో కాంట్రాక్టర్, ప్రజాప్రతినిధులు, ఉపాధి హామీ సిబ్బంది కుమ్మక్కై ఒక లబ్ధిదారునికి రూ. 12వేల చొప్పున చెల్లిం చాల్సిన బిల్లులను కాజేసినట్లు తెలిసింది. ఒక్కొక్క గ్రామంలో సుమారు 20 నుండి 50లక్షల వరకు బీనామి పేర్లపై  బిల్లులు పొందినట్లు తెలుస్తుంది. ఈ అంశాలపై జిల్లా ఉపాధి అధికారి సైతం నిర్లక్షంగా వ్యవ హరించడం మరో కోణంలో విమర్శలకు తావి స్తోంది. గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మించకముందే గ్రామ పంచాయతీ ఖాతాల్లోకి అధికారులు ముం దుగానే అడ్వాన్స్ పేమెంట్లను జమా చేయడంలో ఈ అక్రమాలు జరిగినట్లు విశ్వసనీయ సమా చారం. అవినీతి అక్రమార్కులపై చర్యలు తీసుకు నేందుకే సామాజిక తనిఖీలు, ప్రజావే దికలు నిర్వహించినప్పటికి అట్టి ప్రజావేదికలో సైతం విషయాలు బయటకు పొక్కకుండా వ్యవహరి ంచినట్లు మండల స్థాయి అధికారులపై అనుమాన లు వ్యక్తమవుతున్నాయి. ఊట్‌పల్లిలో సుమారు 332 మరుగుదొడ్లు మంజూరైనప్పటికి అందులో కొందరు లేని వారి పేరిట, మరణి ంచిన వారి పేరిట జాబ్‌కార్డులను పొంది అక్రమాలకు పాల్పడినట్లు తెలిసింది. ఊట్‌పల్లితో పాటు అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న పంచాయతి అధికారులు, ఉపాధి హామీ సిబ్బందితో పాటు మండల స్థాయి అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. కొందరు బినామీ వ్యక్తుల ఖాతాల్లో సైతం 8 నుండి 10లక్షల వరకు అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసి పబ్బం గడుపుకున్నారు. ఇంత జరుగుతున్నప్పటికి ఈ అంశమై ఉన్నతాధికారులు స్పందించకపోవడం గమనార్హం. ఒక పక్కా మరుగుదొడ్లు నిర్మించాలని ప్రచారం చేస్తున్న ఈ గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మించకుండానే బిల్లులను కాజేసి పబ్బం గడుపుతున్నారు. వీటికి బాధ్యులనై వారిపై సత్వర చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
చర్యలు శూన్యం
సామాజిక తనిఖీ అనంతరం 8 గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లకు జిల్లా ఉపాధి హామీ అధికారి నోటిసులు జారీ చేసినప్పటికి ఇంత వరకు ఎలాంటి చర్యలు లేకపోవడంతో కిందిస్థాయి నుండి ఉన్నతాధికారుల తీరుపై అనుమానలు వ్యక్తమవుతున్నాయి. నోటీసులు జారీచేసిన వెంటనే పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. నామమాత్రంగా నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

నాపేరిట బిల్లు పొందారు : సుధాకర్,ఊట్‌పల్లి
నేను మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టకపోయినప్పటికి నాపేరు మీద వచ్చిన 12వేల రూ.లను తీసుకున్నారు. మా ఇంటికి కొందరు వచ్చి మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టారని మీరు సంతకం పెట్టాలని సూచించడంతో నేను ఆశ్చర్యపోయాను.

నాపేరు మీద బిల్లు తీసుకున్న వారిపై చర్య తీసుకోండి: వీరమణి, ఊట్‌పల్లి
నేను మరుగుదొడ్డిని నిర్మించినట్లు నా పేరుమీద 12వేల రూ.ల బిల్లును తీసుకున్నారని నేను నిర్మించకపోయిన నా జాబ్‌కార్డు పై బిల్లు పొందినట్లు కొందరు వచ్చి చెప్పడంతో నాకేమి అర్థం కాలేదు. నేను కట్టకుండానే బిల్లు ఎలా ఇస్తారని నా దగ్గరకు వచ్చిన వారిని అడిగాను. బలవంతంగా వారు సంతకం చేయాలని నాపై ఒత్తిడి తెచ్చారు. అయినప్పటికి నేను సంతకం చేయలేదు. నా పేరు మీద బిల్లు తీసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.

Comments

comments