Search
Thursday 19 April 2018
  • :
  • :
Latest News

కాళేశ్వరం దేశానికే తలమానికం

mdrm*మేడారం సందర్శించిన ఐఎఫ్‌ఎస్ బృందం
*సిఇ వెంకటేశ్వర్లు – ఇఇ నూనె శ్రీధర్‌కు అభినందనలు
ధర్మారం: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడారం భూగర్భ టన్నెల్, పంపుహౌస్‌లను బుధవారం రాత్రి అటవీ శాఖ బృందం సందర్శించింది. రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన సంరక్షణాధికారి పికె జాన్ నేతృత్వంలో యాభై మంది ఐఎఫ్‌ఎస్ అధికారులు బృందం భూగర్భ పనుల్ని పరిశీలించి పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. కన్నెపల్లి, మేడిగడ్డ, నాగారం నుంచి నేరుగా మేడారం చేరుకున్న ఐఎఫ్‌ఎస్ ఉన్నతాధికారుల బృందానికి భూగర్బ పనుల్ని సిఇ వెంకటేశ్వర్ నేతృత్వంలో ఇఇ నూనె శ్రీధర్ ఛాయాచిత్ర ప్రదర్శన ద్వారా కూలంకషంగా వివరించా రు. నిత్యం 2 టిఎంసిల నీటిని సరఫరా చేసే భూగర్బంలోని పంప్‌హౌజ్‌లు, నీటి నిల్వ ప్రదేశాలు, సబ్ స్టేషన్ల నిర్మాణం చూసి ఐఎఫ్‌ఎస్ అధికారుల బృందం ప్రభుత్నాన్ని మూడు షిప్ట్‌ల్లో పనులు నిర్వహిస్తున్న సిఇ వేంకటేశ్వర్లు, ఇఇ నూనె శ్రీధర్‌ను అభినందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పిసిసిఎఫ్ పికె జాన్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం దేశంలోనే గొప్పదిగా, ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు నిర్మాణం లో అటవీ శాఖ భాగస్వామి కావడం గర్వ కారణంగా ఉందని అన్నారు. కాళేశ్వరం పాలమూర్, సీతరామ ప్రా జెక్టుల నిర్మాణంలో 15వేల ఎకరాల అటవీ భూముల్ని నీ టి పారుదల శాఖకు అప్పగిస్తున్నామన్నారు. బృందంలో రాష్ట్ర ప్రభుత్వ లిఫ్ట్ ఇరిగేషన్ లీగల్ అడ్వరైజర్ పెంటారెడ్డి, ప్రిన్సిపాల్ కన్జర్వేటర్ శోభ, ఐఎఫ్‌ఎస్ అధికారులు పరిగన్, ఎండి అక్బర్ ఆర్‌ఎం దోబియాల్, డిఫ్‌వో కృష్ణ మాచారి డివిజన్ల ఐఎఎఫ్‌ఎస్ అధికారులు పాల్గొన్నారు.

Comments

comments