Search
Friday 20 April 2018
  • :
  • :

ఇద్దరి పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

lady
మన తెలంగాణ/వీపనగండ్ల ః వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలంలోని గోపల్‌దిన్నె గ్రామంలో ఆదివారం అత్తామామల వేధింపుల కారణంగా ఇద్దరి పిల్లలతో సహా తల్లిఆత్మహత్య చేసుకున్న సంఘటన పలువురిని కంట తడి పెట్టింది. గ్రామస్తుల వివరాలు, మృతుల బంధువుల వివరాలు ఇలా ఉన్నాయి. గోపల్‌దిన్నె గ్రామానికి చెందిన కుమార్‌రెడ్డికి 8 సంవత్సరాల క్రితం అదే మండలం రంగవరం గ్రామానికి చెందిన రోజాతో వివాహమైంది. వందన (3) లక్ష్మీలాశ్య (5), అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తన భర్త కుమార్‌రెడ్డి మానసిక పరిస్థితి బాగాలేనందున తమ ఆడపడుచు శోభారాణికి అత్తామామలు తరచుగా ఆస్తి, డబ్బు కట్టబెట్టడంపై అత్త అలివేలమ్మ, మామ ఈశ్వర్‌రెడ్డిలను అడుగగా అత్త కోడళ్లు గొడవ పడుతుండేవారు. పుట్టింటి నుండి కోడలు అదనపు కట్నం తేవాలని అత్త అలివేలమ్మ ,మామ ఈశ్వర్‌రెడ్డిలు కోడలును వేధింపులకు గురి చేస్తుండే వారు. ఈ విషయంపై కోడలు రోజ మనస్థాపం చెంది ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో తమ ఇద్దరి పిల్లలు వందన (3) లక్ష్మీలాశ్య (5) లను తీసుకొని ఊరికి దగ్గరలో ఉన్న స్వంత బావి దగ్గరికి చేరుకొని పిల్లలిద్దరిని బావిలోకి తోసి తాను బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకొంది. ఈ విషయాన్ని గమనించిన గ్రామస్తులు బావి దగ్గరకి వెళ్లి చూడగా అప్పటికే బావిలో వారు శవాలై తేలి ఉన్నారు. గ్రామస్తులు బావిలోకి దూకి వారిని వెతికి మృతదేహాలను ఆదివారం రాత్రి 7 గంటలకు బయటికి తీశారు. కుటుంబ సభ్యులు మృతదేహాల వద్ద బోరున విలపించారు. ఈ సంఘటన గ్రామంలోని ప్రతి ఒక్కరు కన్నీరు మున్నీరయ్యారు. ఎస్‌ఐ .సాయిచంద్ర ప్రసాద్ వివరాలను తెలుసుకొని దర్యాప్తు చేసినట్లు ఆయన తెలిపారు. కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

Comments

comments