Search
Sunday 21 January 2018
  • :
  • :

నేరెళ్ల బాధితులకు వామపక్షాల బాసట

cpi

బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం
మనతెలంగాణ/సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్ల ఘటనను నిరసిస్తూ వామపక్షాలు శని వారం చేపట్టిన సిద్దిపేట నుంచి నేరెళ్ల వరకు పాదయాత్ర విజయవంతమైంది. ఈ సందర్భం గా నేతలు నేరెళ్ల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సంఘటనకు కారకులైన ఎస్‌పి సహ పోలీసులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు తమ స హాకారం ఉంటుందని, వారికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హమీలు ఇచ్చారు. ప్రతిరోజు వందలాది లారీల్లో ఇసుక అక్రమంగా జిల్లా సరిహద్దులు దాటుతోందని దీనికి ప్ర భుత్వం అండగా ఉంటోందన్నారు. ఇసుక అక్రమ రవాణా వల్ల ప్రతిరోజు ఎక్కడో ఒకచోట ఇసుక లారీల క్రిందపడి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మి నేని వీరభద్రం, జేఏసి చైర్మన్ కోదండరాం,వామపక్షాల నాయకులు జెవి చలపతిరావు, రమా, జానకి రాములు, మురహరి, రవిచంద్ర, వెంకట్‌రెడ్డి, గుంటి వేణు, కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, బోయిని అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments