Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

పత్రికలు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేయాలి

calender

*‘మన తెలంగాణ’ క్యాలెండర్ ఆవిష్కరించిన మిషన్
భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి

మనతెలంగాణ/మోర్తాడ్: వార్తాపత్రికలు ప్రజలకు ప్రభుత్వానికి మ ధ్య వారధిగా పనిచేయాలని బాల్కొండ నియోజకవర్గ శాసనసభ్యు లు, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. మనతెలంగాణ దినపత్రిక 2018 నూతన సంవత్సర కాల్యెండర్‌ను మోర్తాడ్ మండల ప్రజాపరిషత్ కార్యాలయ ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్తా పత్రికలు ఇటు ప్రజలకు అటుప్రభుత్వానికి మధ్య వారధిగా పని చేయాలని పేర్కొన్నారు. మనతెలంగాణ దినపత్రిక అనతికాలంలోనే వార్తసేకరణలో ప్రజల ఆదరాఅభిమానాలు పొందిందని వారు పేర్కొన్నారు. వార్త సేకరణలో నీతి, నిజాయితీగా రాస్తూ అక్రమాలు, అరచకాలను వెలికితీయాలని అన్నారు. మన తెలంగాణ దినపత్రిక మరింత అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కల్లెడ చిన్నయ్య, వైస్‌ఎంపిపి పవన్, సర్పంచ్ దడిదే నవీన్, మనతెలంగాణ దినపత్రిక రిపోర్టర్లు పద్మయ్య, కడారి రవి, పబ్బ సంజీవ్, దాసరి నరేష్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

Comments

comments