Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

పర్యావరణ పరిరక్షణనే ప్రధాన కర్తవ్యం

madam

*జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్
మన తెలంగాణ/యాదాద్రిభువనగిరి : దేశ వ్యాప్తంగా రాను-రాను పర్యావరణం విషతు ల్యంగా మారుతుందని, పాలకుల ప్రకటనలు ఆచరణ రూపందాల్చడం లేదని అందుకు ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణే ప్రధాన కర్త వ్యంగా భావించాలని పర్యావరణ పరిరక్ష ణలో భాగంగా ప్లాస్టిక్‌ను నిషేధించాలని జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ ఆకాంక్షించారు. ప్రేరణ ప్రజాసైన్స్‌వేదిక నాయకులతోకలిసి ఆమె ఆదివారం బట్టసంచులను ఆవిష్కరిం చా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వలన కూరగాయలు, ఆహార పదార్థాలు విషతుల్యంగా మారే అవ కాశం ఉందని, అందుకు బట్టసంచులు జన పనారతో తయారుచేసిన సంచులను మా త్ర మే వాడాలని కలెక్టర్ కోరారు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వ కోట్లాది రూ॥లు ఖర్చు చేసి లక్షలాది మొక్కలను నాటుతుందని, వా టిని సంర క్షిం చాల్సిన బాధ్యత ప్రతి పౌరు నిపై ఉందని, ప్రజా ఆరోగ్యానికి హాని జరు గకుండా బట్టసం చులను తయారుచేసి ప్రజ లను చైతన్యం ప్రేరణప్రజాసైన్స్ వేదికను ఆమె అభినందించారు. ప్రేరణప్రజాపైన్స్‌వేదిక జిల్లా కన్వినర్ కందుకూరి సోమన్న మాట్లాడారు. ఈ కార్య్రమంలో స్థానిక ఆర్‌డిఓ ఎంవి భూపాల్‌రెడ్డి, చౌటుప్పల్ ఆర్‌డిఓ ఎస్. సూరజ్ కుమార్, ప్రేరణ ప్రజాసైన్స్‌వేదిక యాదాద్రి భువనగిరి జిల్లా కన్వినర్ కొడారి వెంకటేష్, జిల్లా నాయకులు జిట్ట బాస్కర్‌రెడ్డి, చిలకమారి గణేష్, దాసరిశ్రీనివాస్, చింతల సాయిబాబ, మల్లారెడ్డి, కురుపల్లి సత్తిరెడ్డి పాల్గొన్నారు.

Comments

comments