Search
Sunday 22 April 2018
  • :
  • :
Latest News

నత్తనడకన కొనసాగుతున్న మిషన్ భగీరథ పనులు

mission

-అమలు కాని ప్రభుత్వ హామీలు ఇంటింటికి చేరని నీరు
-గడువు దాటిన పూర్తి కాని మిషన్ భగీరథ పనులు
-గ్రామంలో నిర్మాణం కాని ట్యాంకులు
-నిర్లక్షం వహిస్తున్న అధికారులు
మన తెలంగాణ/అచ్చంపేట రూరల్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా చేపట్టిన మిషన్ భగీరథ పనులు అచ్చంపేట నియోజకవర్గంలో నత్తనడక గా సాగుతున్నాయి. డిసెంబర్ చివరి నాటికి తాగునీటిని అందిస్తామని స్వ యంగా సీఎం కేసిఆర్ హామి ఇచ్చినా సంబంధిత అధికారుల నిర్లక్షం మూలంగా గ్రామంలో ఇప్పటి వరకు ట్యాంకుల నిర్మాణమే పూర్తి స్థాయిలో జరగలేదని పలువురు చర్చించుకుంటున్నారు. గ్రామాలలో మిషన్ భగీరథ పథకంలో 10గ్రామ పంచాయతీలలో 17 ట్యాంకుల నిర్మాణానికి అగ్రిమెం ట్లు పూర్తయ్యాయి. 26 వాటిలో కేవలం 6ట్యాంకులు పూర్తి నిర్మాణాలకు నోచుకున్నాయి. 14 బీమ్సు లేవల్‌గా ఉండగా 6 టాప్ స్లాబ్ లెవల్‌గా ఉన్నా యి. ఇంకా 11ట్యాంకులు అగ్రిమెంట్ కావాల్సి ఉంది. డిసెంబర్ చివరి నాటికి పనులన్ని పూర్తి చేసి ఇంటింటికి నల్లాల ద్వారా అందిస్తామనే లక్షం తో ప్రభుత్వం ఉంటే బాద్యత గల అధికారులు లక్షాన్ని నీరు గార్చారు. అధికారులు మాత్రం త్వరలోనే అన్ని ట్యాంకులకు అగ్రిమెంట్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తున్నామని చెబుతున్నారు. 31 ట్యాంకుల నిర్మాణాలు ప్రగతిలో ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపించడంతో పాటు కాంట్రాక్ట ర్లు పనులపై శ్రధ్ద వహించడం లేదని మండల వాసులుఆరోపిస్తున్నారు. గ్రామాలకు నల్లాల ద్వారా మంచినీటిని అందించుటకు పైపులైన్ పనులు నాసిరకంగా ఉన్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. కొన్ని చోట్ల కాలువలు తీయకుండా నామ మాత్రంగా దిమ్మెలను ఏర్పాటుచేసి పైపులను పరుస్తున్నా రని నాలుగురోజులకే పైపులు దిమ్మెలు పాడై పోతాయని ఆయా ఏజిన్సీ గ్రామాల ప్రజలు వాపోతున్నారు . కాలువలు తీసి నెలలు గడుస్తున్నా వాటి లో పైపులు ఏర్పాటు చేసి పూర్చడం లేదని పశువులకు చిన్నపిల్లలకు, వృద్దుల కు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు వాపోతున్నారు. పనులను పర్యవేక్షించే అధికారులు ఇట్టి పనులపై శ్రద్ద వహించి పైపులను పూడ్చి వేయాలని ప్రజలు కోరుతున్నారు. మధు ఆర్‌ఎస్ డబ్లూ ఈఈ వివరణ జూ న్ వరకు పనులను పూర్తి చేస్తాం తెలంగాణ మిషన్ భగీరథ పనుల గడువు ను జూన్ వరకు పెంచిందని గడువులోగా పనులన్నింటిని పూర్తి చేసి గ్రామా లలో నల్లాల ద్వారా మంచి నీటిని అందించి చర్యలు తీసుకుంటామన్నారు.

Comments

comments