Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

ప్రైవేట్ ఆసుపత్రుల తీరుపై..మెడికల్ కౌన్సిల్ ఆగ్రహం

PAPER

*కలెక్టర్ ఫిర్యాదు మేరకు ప్రైవేట్ ఆసుపత్రుల తనిఖీ
*రికార్డులన పరిశీలించిన రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సభ్యులు
*90శాతం సీజెరిన్ ఆపరేషన్లు చేయడం పట్ల ఆగ్రహం

మన తెలంగాణ/సంగారెడ్డి టౌన్ : సంగారెడ్డి జిల్లా కలెక్టర్ మాణిక్ రాజ్ కణ్ణన్ తొంబై శాతానికి పైగా సీజెరిన్ ఆఫరేషన్లు చేస్తున్న  ప్రైవేట్ ఆసుపత్రులపై గతంలో ఇచ్చిన ఫిర్యాదు మేర కు తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సభ్యులు శుక్రవారం  సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు.  తెలంగాణ రాష్ట్ర మెడికల్ సభ్యులు డాక్టర్ వైరాగ్యం, రాజలిం గం, డాక్టర్ అనిత నేతృత్వంలో ఆకస్మీక తనిఖీ లు నిర్వహించారు. సంగారెడ్డి పట్టణంలో గల జ్యోతి మెటర్నేటీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా ఆసుపత్రి రి కార్డులు, కేసిట్లు, ఔట్ పేషెంట్, ఇన్ పే షెం ట్, రెఫరల్, ఆఫరేషన్ థియేటర్ రికార్డుల ను క్షుణ్ణంగా పరిశీలించారు. కేషిట్లు వైద్య వి ధానాలకు అనుగుణంగా నిర్వహించడం లేదన్నా రు. ముఖ్యంగా ప్రసవాలకు సంబంధించి సీజెరిన్‌కు దారితీసిన కారణాలను సంబంధిత రికార్డుల్లో ఎందుకు పొందుపర్చలేదని అడిగి తెలుసుకున్నారు.  ప్రసవ సమయం లో  తల్లి, గర్బస్థ శిశువుకు సంబంధించిన హృద య స్పందనను కొలిచే పార్టోగ్రాఫ్ అనే గ్రాఫీకల్ రికార్డును నిర్వహించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పటాన్ చెరులో గల పీపుల్స్ ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఆసుపత్రిలో నెలకొ న్న అపరిశుభ్రత వాతావరణాన్ని చూసి ఆగ్రహ ం వ్యక్తం చేశారు. ఆఫరేషన్ థియేటర్‌లో పాత ఎక్యూమెంట్, ఆసుపత్రిలో ఉన్న ఇన్‌పేషంట్‌లకు ప్రైవసి లేకపోవడంతో పట్ల అసంతృప్తి వ్య క్తం చేశారు. స్కానింగ్ సెంటర్‌సైతం మొదటి అంతస్సులో ఉండి రోగులకు వెళ్లేందుకు ఇబ్బం ది ఉందని, విశాలంగా ఉండేలా తగు  చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి నిర్వాహకులను ఆదేశించారు.  ఆసుపత్రిలో నిర్వహిస్తున్న ఆఫరేషన్ల ను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు.  ఆ ఫరేషన్లుమినహాయించి ఇతర  సేవలను కొనసాగించవచ్చన్నారు. ఈ సందర్భంగా  మెడికల్ కౌ న్సిల్  సభ్యులు స్పందిస్తూ.. వైద్య విధానాల ప్ర కారం అనివార్య  పరిస్థితుల్లో కేవలం 30 శాతం సీజెరిన్ ఆపరేషన్లు చేయాల్సి ఉండగా.. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు 90శాతానికి పైగా ఆపరేష న్లు నిర్వహించడం శోచనీయమన్నారు.ఈ తనిఖీల్లో మెడికల్  కౌన్సిల్ టీమ్, ఇంచార్జి డిఎంఅండ్‌హెచ్‌ఓ గాయత్రి దేవి, డా.శశాంక్ ఉన్నారు.

Comments

comments