Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

వ్యక్తి దారుణ హత్య

police

… స్థానికులపైనే కుటుంబ సభ్యుల అనుమానాలు
… విచారణ చేపట్టిన పోలీసులు

మనతెలంగాణ/కన్నెపల్లిః
భీమిని మండలంలోని రాంపూర్ గ్రామంలో జాలంపల్లి శ్రీనివాస్(42) దారుణ హత్యకు గురైన సంఘటన శనివారం ఉదయం వెలుగు చూసింది. మృతిని ఇంటి సమీపంలో పత్తి చేనులో శవమై కనిపించిన సంఘటనతో గ్రామంలో కలకలం సృష్టించింది. ఘటన స్థలాన్ని తాండూర్ సిఐ జనార్థన్ రెడ్డి వెళ్లి హత్యకు గల కారణాలను విచారణ చేపట్టారు. గ్రామంలో పలువురిని విచారించగా గ్రామస్థుల నుంచి పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని సిఐ తెలిపారు. డాగ్‌స్వాడ్‌తో పరిశీలించగా మృతి ఇంటి పక్క నుండి సత్యగౌడ్ ఇంటి వద్ద ఆగిపోయిందని, అనుమానితుడు ఇంట్లో లేడని, మృతుని కుమార్తె ప్రేమ వ్యవహారమే హత్యకు దారితీసినట్లు తెలుస్తుందని, ఇంటి పక్కనే ఉండే ఓ యువకుని నిందితునిగా అనుమానిస్తున్నట్లు సిఐ తెలిపారు. మృతిని తలపై బలమైన గాయాలు, మృతుని తలపై బండరాయితో బలంగా కొట్టడంతో రక్త శ్రావం కావడంతో మృతి చెందాడని, హత్య చేసిన అనంతరం మృతుని శవాన్ని పత్తి చేనులో పడేసి పరారీ అయినట్లు పోలీసులు తెలిపారు. నిందితున్ని త్వరలోనే పట్టుకుంటామని ఆయన అన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు. ఘటన స్థలాన్ని ఎస్‌ఐ లక్ష్మణ్, తాండూర్ ఎస్‌ఐ రవి, వైస్ ఎంపిపి మహేశ్వర్‌గౌడ్‌లు సందర్శించారు.

Comments

comments