Search
Saturday 21 April 2018
  • :
  • :

వ్యక్తి దారుణ హత్య

murder

* అక్రమ సంబంధమే హత్యకు కారణం
* ఇద్దరు ప్రకాశం జిల్లాకు చెందిన వారు

మన తెలంగాణ/హన్వాడ : అక్రమ సంబంధంతో ఓ హత్యకు దారి తీసిన సంఘటన శనివారం మండలంలో దారితీసింది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని షేక్‌పల్లి గ్రామంలో మిషన్‌భగీరథ పనులు జరుగుతున్నాయి. ఈ పనుల్లో ప్రకాశం జిల్లా రామయ్యపాలెంకు చెందిన సాదిక్, జహీరాలు పని చేసేందుకు ఇక్కడికి వచ్చారు. అయితే ప్రకాశం జిల్లా మరకాపురంకు చెందిన గంగిరెడ్డి (34) అతనికి సాధిక్ భార్యతో అక్రమ సంబంధం ఉండేది. అయితే  సాధిక్, ఆయన భార్య పని చేసే విషయాన్ని తెలుసుకుని గంగిరెడ్డి శుక్రవారం రాత్రి షేక్‌పల్లి గ్రామానికి చేరుకుని నేరుగా  సాధిక్  వద్దకు వెళ్లాడు. గతంలో ఇద్దరి మధ్య ఉన్న విషయం వల్ల గొడవలు జరిగాయి. గంగిరెడ్డి సాధిక్ భార్యతో మాట్లాడుతున్న సమయంలో గొడవ జరిగింది. అయితే సాధిక్ గంగిరెడ్డిని బెధిరించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అర్ధరాత్రి అయ్యాక మళ్లి గంగిరెడ్డి వారి దగ్గరకు రావడంతో అప్పటికే కక్ష పెంచుకున్న సాధిక్ కత్తితో గంగిరెడ్డిని పొడిచి గొంతు కోశాడు. దీంతో గంగిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలం చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతునికి పెళ్లయింది కానీ పిల్లలు కాలేదు.

Comments

comments