Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

జాతీయ జెండా గౌరవంపై ఆదేశాలు జారీ

national-flag

హైదరాబాద్: జాతీయ జెండా గౌరవంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టిక్, కాగితం తయారీ సహా చిన్న పరిమాణంలో ఉన్న జెండాలు వాడొద్దని స్పష్టం చేసింది. జిల్లా న్యాయమూర్తులు, కలెక్టర్లు, ఎస్పిలు, శాఖాధిపతులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జెండా నిబంధనావళి 2002, జాతీయ పతాక గౌరవ చట్టం 1971 అమలుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. జెండా ఆవిష్కరణలో నిబంధనలు అమలయ్యేలా చూడాలని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది.

Comments

comments