Search
Tuesday 19 June 2018
  • :
  • :

పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి

hal

మన తెలంగాణ / రంగారెడ్డి : సిపిఎస్‌ను రద్దు చేసే వరకు ఉపాధ్యాయులంతా పోరాటం చేయాల్సిన అవసరముందని ఎస్టియూ రాష్ట్ర అధ్యక్షులు సదానంద్‌గౌడ్  పిలుపునిచ్చారు. చేవెళ్ల మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయం ఆవరణలో మంగళవారం ఎస్టియూ చేవెళ్ల శాఖ సర్వ సభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. సిపిఎస్ విధానాన్ని ప్రభుత్వం వెంటనే రద్దు చేసి ఉద్యోగులకు సర్కారు న్యాయం చేయాలన్నారు. సిపిఎస్ విధానం రద్దు కోసం ఎస్టియూ ముందుండి పోరాడుతుందన్నారు. దశల వారిగా ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కరించాలని కోరడం జరుగుతోందన్నారు.నూతన పెన్షన్ విధానం (సిపిఎస్) రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఎస్టీయూ ఎల్లప్పుడు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై పాటుపడుతోందన్నారు. అనంతరం ఎస్టియూ సంఘం డైరీని ఆవిష్కరించి చేవెళ్ల ఎంఈఓ కెఎన్. సుజాతకు అందజేశారు.  ఈ సమావేశంలో ఎస్టియూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి. ఖాజపాష, రంగారెడ్డి జిల్లా  ప్రధాన కార్యదర్శి పరమేశ్వర్, బి.వి. వెంకటేశ్వర్లు, సంఘం సభ్యులు ఎం. శ్రీనివాస్‌రెడ్డి, వి. శ్రీధర్, వి. శ్రీనివాస్, హిమామ్‌షా, ఎం. నాగేశం, ఎం. శ్రీనివాస్, మహిపాల్‌రెడ్డి, రాములు, నర్సింలు, హఫీజ్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments