Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

మనస్థాపానికి గురై వ్యక్తి ఆత్మహత్య

bike
మనతెలంగాణ/శామీర్‌పేట: మనస్థాపానికి గురై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం మండలంలోని తూంకుంటకు చెందిన ఆదిశేషు(45) పండ్ల వ్యాపారం చేసుకుంటు జీవిస్తున్నాడు. గత నెల రోజుల క్రితం అతని భార్య లక్ష్మీతులసి పుట్టింటికి వెళ్లిపోగా సోమవారం ఆదిశేషుని తీసుక రావడానికి వెల్లాడు. భార్యను పంపించకుండ పెద్దలను తీసుక వస్తే పంపుతామని తిరిగి పంపించారు. దింతో ఆదిశేషు తూంకుంటకు వచ్చి తన బంధువులకు, తన సోదరులు రావాలని నేను ఆత్మహత్య చేసుకుంటానని ఫొన్‌లో తెలిపాడు. సోదరుడు సోమవారం సాయంత్రం వచ్చి మనస్థాపానికి గురికావద్దని నచ్చజెప్పి వెల్లిపోయాడు. మనస్థాపానికి గురైన ఆదిశేషు మంగళవారం ఉదయం తూంకుంట స్పోర్ట్ స్కూల్ సమీపంలోని అటవి ప్రాంతంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా మృతుడు గత 20 ఏళ్ళ క్రితం కృష్ణ జిల్లా నుంచి బతుకుదెరువు కోసం తూంకుంటకు వచ్చి స్థిరపడ్డాడు. ఈ మేరకు శామీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments