Search
Saturday 21 April 2018
  • :
  • :

ప్రజా సేవే పరమావధిగా ముందుకు సాగుతున్నా: ఎమ్మెల్యే

trsమన తెలంగాణ/కమాన్‌పూర్: ప్రజాసేవే పరమావధిగా ముందుకు సాగుతున్నానని ప్రజా సమస్యల పరిష్కారానికే నేరుగా మీ వద్దకు వచ్చానని ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కెసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని మంథని ఎమ్మెల్యే పుట్ట మధుకర్ తెలిపారు. మన ఊరు- మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండలంలోని గుండారం, రాజాపూర్, పేరపల్లి,గోల్లపల్లి, రోంపికుంట, నాగారం,లింగాల, పేంచికల్‌పేట గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయా గ్రామాల్లో ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించగా  పేద ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని వారి సంక్షేమానికి ఎల్లప్పుడు కృషి చేస్తామని ఆయన పేర్కోన్నారు. మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమం ద్వారా పల్లెపల్లెను చుట్టి క్షేత్ర స్థాయిలో వారి సమస్యలు తెలుసుకోవడానికి మీ ముందుకు వచ్చానన్నారు. అర్హులందరికి సంక్షేమ ఫలితాలు అందజేయడమే తమ లక్షమని, గ్రామాల్లో మౌళికవసతుల కల్పనే ధ్యేయంగా రాసా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రభుత్వం ఎంతోప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులో బాగంగా ఉమ్మడి కమాన్‌పూర్ మండలం సుందిళ్ల బ్యారేజీ నుండి మండలంలోని చెరువులను, కుంటలను నింపడానికి ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందన్నారు.

ముఖ్యమంత్రి కెసీఆర్‌తోనే అభివృద్ది సాధ్యమని ఏన్నో ఏళ్లుగా పరిష్కారం కాని భూ సమస్యల పరిష్కారం కోరకు భూ రికార్డుల శుద్దీకరణ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు.  గత పాలకుల నిర్లక్షం వ్యవసాయం దండుగ అనుకున్న రైతులకు నేడు ఏకరాకు ఒక పంటకు 4 వేల రూపాయల చోప్పున అందజేయడం జరుగుతుందన్నారు. సమైక్య రాష్ట్రంలో రైతులు కరెంట్ కష్టాలు ఎదుర్కున్నారని నేడు వ్యవసాయానాకి 24 గంటల కరెంట్ ఇవ్వడం జరుగుతుందన్నారు.  తమ తల్లిగారైన పుట్ట లింగమ్మ చారీటబుల్ ట్రస్ట్ ద్వారా నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల ఆకలి తీర్చేందుకు మధ్యాహ్నా బోజన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని మరియు ఉచిత అంబలి, దళిత కాలనీలో విద్యుత్ మీటర్లును అందించడంతో, ట్రస్ట్ ద్వారా అంబులెన్స్‌లు ఏర్పాటు చేయడం, వికాలంగులకు ట్రై సైకిళ్లును పంపిణి చేయడం, కిచెన్ గార్డెన్ పేరుతో కూరగాయల విత్తనాలను అందిచడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. నిత్యం ప్రజల మధ్యే ఉంటూ ప్రజా సంక్షేమానికి కృషి చేస్తానానని తెలిపారు. రోంపికుంట గ్రామంలో కిచెన్ షెడ్డులను, ఐ మాస్‌లైట్స్‌ను ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్‌ఎస్ అద్యక్షులు కిషన్‌రెడ్డి, జెడ్పీటీసీ మేకల సంపత్, ఎంపిపి ఇనుగంటి ప్రేమలత, వైస్ ఎంపిపి కోట్టె భూమయ్య, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు ఆకుల గట్టయ్య, పులిపాక శారద రాయలింగు, సాగి శ్రీదర్‌రావు, లక్ష్మీ, గాదె అనూరాద సది, నాయకులు ఇనుగంటి రామరావు, ఇనుగంటి బాస్కర్‌రావు,ఫీట్ల గోపాల్, పూదరి సత్యనారయణ గౌడ్, దాసరి రాయలింగు, పుల్లెల కిరణ్, ఆడెపు రమేష్, మేడగోని విజయ్ గౌడ్, బూర్గు రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments