Search
Saturday 20 January 2018
  • :
  • :
Latest News

ప్రయాణికుల క్షేమమే ధ్యేయం

speak

రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి

మన తెలంగాణ/పరిగి: ప్రయాణికులను సురక్షితంగా గమ్యాలకు చేర్చుతూ వారి సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను నడిపిస్తున్నామని రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. పరిగిలో శనివారం ఎమ్మెల్యే నిధులు రూ. 28, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ )నిధులు రూ.28 లక్ష లు మొత్తం 56 లక్షల నిధులతో ఆర్టీసీలో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం 93 లక్షల ప్రయాణికులను సురక్షితంగా గమ్యాలకు చేర్చే ఏకైక సంస్థ ఆర్టీసీయేనని గర్వంగా చెప్పవచ్చన్నారు. ప్రజా రవాణా వ్యవస్థలను మరింత బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ ఆర్టీసికి బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయించారన్నారు. పరిగి ఆర్టీసీ డిపోకు ఎమ్మెల్యే నిధుల నుంచి రూ. 28 లక్షలు కేయించి డిపో అభివృద్దికి ముందుకు రావడం చాలా సంతోషకర విషయమన్నారు.

Comments

comments