Search
Thursday 19 April 2018
  • :
  • :
Latest News

రోడ్డు లేక ఇబ్బంది పడుతున్న గిరిజనులు

girijanమన తెలంగాణ/పెద్దవంగర : ఎన్ని ప్రభుత్వాలు మారినా గిరిజనులకు కాలినడకే శరణ్యం. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఇదే పరిస్థితి. తండా నుంచి కాలినడకనే వెళ్ళాల్సివస్తుంది. రోడ్లు లేక ఇబ్బంది పడుతున్నారు, అనారోగ్య సమస్య వస్తే ఆటోలు రావు, దారి సరిగాలేక నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. మండల కేంద్రంలోని పెద్దవంగర శివారులో గల హజుర్యతండాకు  రోడ్డు లేక జనాలు నానా ఇబ్బందులు పడుతున్నారు. స్థానికులు చెప్పిన ప్రకారం మా తండాలో పది గృహాలు దాదాపు 100 మంది జనాలు , అందులో 20మంది స్కూల్ పిల్లలు , ఇద్దరు కాలేజ్ విద్యార్థులు ఉంటారు. కాని తండా నుండి పెద్దవంగరకు దాదాపు మూడు కిలోమీటర్ల దూరం ఉండటంతో స్కూల్‌కు పోవాలంటే రోడ్డు లేక బడి మానేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడో ఈజియస్ ద్వారా కరువు పనిలో రోడ్డు మరమ్మత్తు చేసి వదలివేశారు. రోడ్డుపై చెట్టు మొలిచి దారి మొత్తం నడవకుండా అయిపోయిందని, స్థానిక ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, వర్షాకాలం రాకముందే రోడ్డు బాగుచేయించాలని పాలకుర్తి శాసన సభ్యులు ఎర్రబెల్లి దమాకర్‌రావు గారికి పత్రిక ద్వారా వారు కోరుతున్నారు. వారిలో గుగులోత్ యాకన్న , వీరన్న , శ్రీరాములు , ప్రవిణ్ , జోమన్న , బిచ్చ, మొగిలి తదితరులు ఉన్నారు.

Comments

comments