Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

తెలంగాణ పునర్ నిర్మాణంలో పత్రికల పాత్ర కీలకం

calender

‘మన తెలంగాణ’ దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణలో మంత్రి 

మన తెలంగాణ/కామారెడ్డి: నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ పునర్నిర్మాణంలో పత్రికల పాత్ర కీలకమని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో మన తెలంగాణ దినపత్రిక క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అగ్రగామిగా ఉందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలలో బంగారు తెలంగాణ పునర్నిర్మాణంలో పత్రికల పాత్ర ఎంతో కీలకమన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, వృద్ద్ధులకు పెన్షన్ల పంపిణీ, రైతులకు రూ. 4 వేల పంపిణీ, 24 గంటల కరెంటు, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం , తదితర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పత్రికల పాత్ర అమోఘమన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారథిగా పత్రికలు పనిచేస్తున్నాయన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పత్రికా కథనాలు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. జిల్లా కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ నూతన జిల్లాగా కామారెడ్డి ఏర్పడ్డప్పటికీ అన్ని సంక్షేమ రంగాల్లో మొదటి  5 స్థానాల్లో ఉంటుందని దానికి కారణం పత్రికల కృషే అని కొనియాడారు. జిల్లాలో జరుగుతున్న వివిధ సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకురావడంలో పత్రికల పాత్ర కీలకమన్నారు. పత్రికలు, జిల్లా అధికారుల  సమన్వయంతో కామారెడ్డి జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు.  అనంతర టిఎన్జీవోస్ క్యాలెండర్‌ను వారు అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సత్యనారాయణ, జడ్ పి చైర్మన్ దపేధర్ రాజు,  ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ పిప్పిరి సుష్మ వెంకట్, మన తెలంగాణ విలేకరుల బృందం ముదాం శంకర్ పటేల్, రఫీక్, యాదయ్య, సంతోష్, ముదాం శివశంకర్, అరవింద్, ప్రకాశ్, శ్రీధర్,టిఎన్జీవో ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి,  ప్రజా ప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు  తదితరులు పాల్గొన్నారు.

Comments

comments