Search
Sunday 22 April 2018
  • :
  • :
Latest News

తెలంగాణ ఉద్యమంలో టిఎన్‌జిఒల పాత్ర కీలకం

trs

టిఎన్‌జిఒ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఎంపి కవిత

మనతెలంగాణ/నిజామాబాద్ బ్యూరో
టిఎన్‌జిఓలు రాష్ట్ర ప్రభుత్వానికి కుటుంబసభ్యులు అని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. శనివారం నిజామాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో జరిగిన టిఎన్‌జిఓ స్టాండింగ్ కమిటి సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హజరయ్యారు. ముందుగా జ్యోతిప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు. అనంతరం ఎంపి కవిత మాట్లాడుతూ ప్రభు త్వ ఉద్యోగం వేర్వేరు కాదన్నారు. దీపం వెలుతురును విడదీయలేమన్నట్లే ఉద్యోగులు, ప్రభుత్వంను కూడా వీడదీయలేమన్నారు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలను అమలు చేసేది ఉద్యోగులేనన్నారు. ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం మాదని సిఎం కెసిఆర్ ప్రకటించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. 70 యేళ్ల చరిత్ర కలిగిన టిఎన్‌జిఓ సంఘం ఉద్యోగుల కోసం పోరాటం చేస్తూనే తెలంగాణ సమాజం కోసం పని చేస్తున్న సంస్థ అని అభివర్ణించారు. 1969లో తెలంగాణ ఉద్యమం తెరపైకి వచ్చి వెనక్కిపోయిందని మళ్ళీ 2001లో మళ్లీ ఉద్యమం మొదలై ందని ఆమె తెలిపారు. కొందరు రాజకీయ నాయకుల ఆలోచన విధానం మారినప్పటికీ ఉద్యమంలో తమవంతు పాత్రను పోషించిన సంఘం టిఎన్‌జిఓ అన్నారు. 610 జిఓను సాధించిన ఘనత కూడా ఈ సంఘందే అని ఎంపీ న్నారు. సెక్రటేరియేట్‌లో ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్లు ముందు ఉండి కూడా ఉద్యమం చేసిన తీరు సమాజం ఎప్పటికీ మరిచిపోదన్నారు. 14 ఏళ్ల నిప్పును చేత్తో పట్టుకుని ఉద్యమం చేసారని కాబట్టే ముఖ్యమంత్రి కెసిఆర్‌కు టిఎన్‌జిఓలంటే ఎనలేని ప్రేమ అన్నారు. అంగన్‌వాడీ వర్కర్లను ఆదుకున్న తీరు ను ఎంపీ కవిత కొనియాడారు. ఇంకా అంగన్‌వాడీ వర్కర్ల సమస్యలు మిగిలిపోయాయని వాటిని సిఎం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. హరితహారం, తెలంగాణ రాష్ట్రం ఆవిర్బావం కార్యక్రమాలను అందరూ హజరవుతారు కానీ సిఎం దీక్షా చేసిన రోజున నిజామాబాద్ కలెక్టరేట్ గ్రౌండ్‌లో నిర్వహించిన దీక్షాదీవాస్‌కు టిఎన్‌జిఓలు పెద్ద సంఖ్యలో హజరయ్యారని తెలిపారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై వారికి ఎంత ప్రేమ ఉందో అని ఇదే నిదర్శనమన్నారు. నిజామాబాద్‌లో రూ. 1కోటితో టిఎన్‌జిఓ భవన్ నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యేలా చూస్తానని ఎంపీ కవిత చెప్పారు. అలాగే జర్నలిస్టులు, ఉద్యోగుల వైద్య సదుపాయాల కోసం నిజామాబాద్‌లో వెల్‌నెస్ సెంటర్‌ను త్వరలో ప్రారంభించేలా కృషిచేస్తానని  ఈ సందర్బంగా ఆమె తెలిపారు. అనంతరం టిఎన్‌జిఓ నూతన సంవత్సర 2018 డైరి, క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ విజిగౌడ్, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, టిఎన్‌జిఓ చైర్మన్ దేవిప్రసాద్, అధ్యక్షుడు రవీంధర్‌రెడ్డి, జడ్పి చైర్మన్ ధాపేదర్‌రాజు, నగర మేయర్ ఆకుల సుజాత, జిల్లా కలెక్టర్ రామ్మోహన్‌రావు, నిజామాబాద్ టిఎన్‌జిఓ అధ్యక్షుడు అలుక కిషన్, కార్యదర్శి రాజేంధర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments