Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

దద్దరిల్లిన ధర్మాసనం

supreme

సిజెపై చలమేశ్వర్ సహా నలుగురు సుప్రీం న్యాయమూర్తుల బహిరంగ తిరుగుబావుటా

వేరే దారి లేకనే :  చలమేశ్వర్ 

‘సుప్రీంకోర్టులో పాలన గాడి తప్పింది, ప్రధాన న్యాయమూర్తి పట్టించుకోవడం లేదు’ 

భారత న్యాయవ్యవస్థ చరిత్రలో అనూహ్య పరిణామం. నలుగురు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు మొట్టమొదటిసారిగా కలిసికట్టుగా మీడియా ముందుకొచ్చారు. ప్రధాన న్యాయమూర్తి(సిజెఐ) దీపక్ మిశ్రాపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. న్యాయ వ్యవస్థలో జరుగుతున్న పరిణామాలపై బహిరంగంగా విమర్శలు ఎక్కుపెట్టారు. తెలుగువాడు, జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నివాసం శుక్రవారంనాడు ఈ సంచలన పరిణామానికి వేదికైంది. చలమేశ్వర్‌తో పాటు మీడియా ఎదుటకు వచ్చిన వారిలో జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ ఉన్నారు. న్యాయవ్యవస్థలో కొద్ది మాసాలుగా  అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో తాము నోరుమెదపకపోతే ప్రజాస్వామ్యానికి చేటు చేసిన వాళ్లమవుతామని అన్నారు. సుప్రీంకోర్టులో పాలన క్రమపద్ధతిలో జరగడంలేదని, ఇదే విషయాన్ని చీఫ్ జస్టిస్‌కు చెప్పినా ఫలితం కనిపించలేదన్నారు. విధిలేని పరిస్థితుల్లో మీడియా ముందుకు వచ్చామన్నారు. 

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టులో చోటు చేసుకుంటున్న పరిణామాలపై తాము నలుగురం విస్తృతంగా చర్చించి, ఆందోళన వ్యక్తపరుస్తూ కొద్ది మాసాల క్రితం చీఫ్ జస్టిస్‌కు ఏడు పేజీలతో కూడిన లేఖ రాశామని జస్టిస్ చలమేశ్వర్ అన్నా రు. పాలనను గాడిలో పెట్టాలని అందులో కోరామని, దాని కి సమాధానం రాకపోవడంతో శుక్రవారం ఉదయం మరోసారి ప్రధాన న్యాయమూర్తిని ప్రత్యక్షంగా కలిసినా ప్రయోజనం లేకపోయిందన్నారు. ఆయనను ఒప్పించలేకపోయామని చలమేశ్వర్ పేర్కొన్నారు. గత్యంతరంలేక జాతి ప్ర యోజనాలు, ప్రజాస్వామ్య పటిష్టత కోసం ఆ బాధ్యతను తప్పనిసరి పరిస్థితుల్లో తలకెత్తుకున్నామన్నారు. ప్రపంచ చరిత్రలోనే, ముఖ్యంగా మన దేశ న్యాయవ్యవస్థలో కొందరు న్యాయమూర్తులు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం అనూహ్య పరిణామమని చలమేశ్వర్ అభివర్ణించారు. ఇలా సమావేశం పెట్టడం బాధకరమే అయినా సుప్రీంకోర్టుకు, దేశానికి బాధ్యత కలిగివున్నామని అన్నారు. సేచ్ఛాయుత న్యాయవ్యవస్థ లేకపోతే ప్రజాస్వామ్యం మనుగుడ కష్టసాధ్యమన్నారు. ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసనను కోరుకుంటున్నారా అన్న ప్రశ్నకు ‘అది దేశం నిర్ణయించుకుంటుంది’అని చలమేశ్వర్ బదులిచ్చారు. నిబంధనలు, సీనియారిటీని మీరు పక్కనబెడుతున్నారా? అన్న మీడియా ప్రశ్నకు..ఇక్కడ ఎవరూ ఎవరి ర్యాంకులను మితిమీరి ప్రవర్తించడం లేదని జస్టిస్ రంజన్ గొగోయ్ అన్నారు. అనంతరం ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాకు రాసిని ఏడు పేజీల లేఖను న్యాయమూర్తులు మీడియాకు విడుదల చేశారు.
అటార్నీ జనరల్‌తో సిజెఐ భేటీ : నలుగురు న్యాయమూర్తులు తనపై బహిరంగంగా తిరుగుబాటు చేసిన కొద్ది గంటల్లోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా హుటాహుటిన అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై ఆయనతో చర్చించినట్లు సమాచారం. ఈ మేరకు న్యాయస్థానం వర్గాలు వెల్లడించాయి. అనూహ్యరీతిలో జడ్జిలు మీడియా ఎదుటకు రావడంపై ప్రధాని మోడీ కూడా స్పందించారు. న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Comments

comments