Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

పాలకులు మారినా… తెలంగాణలో పాలన మారలేదు

gaddar– జగిత్యాల జైత్రయాత్ర స్ఫూర్తితో
సామాజిక తెలంగాణ కోసం మరో ఉద్యమం
– ప్రజా యుద్ధ నౌక గద్దర్

మనతెలంగాణ / జగిత్యాలటౌన్ : అమరవీరుల త్యాగాలు, బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పాలకులు మారారే తప్పా పాలనలో ఎలాంటి మార్పు రాలేదని ప్రజా యుద్ద నౌక గద్ద ర్ అన్నారు. టిమాస్ జగిత్యాల జిల్లా ఆవిర్బావ సభలో పాల్గొనేందుకు శుక్రవారం జగిత్యాల వచ్చిన గద్దర్ విలేకరులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీళ్ళు, నిధులు, నియామకాలు, స్వపరిపాలన కోసం ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని తలకెత్తుకొని ఎందరో యు వకులు, విద్యార్థులు ఆత్మ బలిదానాలకు పాల్పడితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు.  అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమ ఆకాంక్షలు నెరవేరుతాయని ఆశించిన ప్రజలకు నిరాశే ఎదురైందన్నారు. ఉద్యమ సమయంలో ఉన్న ప్ర జల ఎజెండా ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు అమలు కాలేదన్నారు. తెలంగాణ ప్రజా ఫ్రంట్ చైర్మన్‌గా జగిత్యాలకు వచ్చానని జగిత్యాల మట్టి తల్లికి వందనాలు తెలుపుతూ మరో స్పష్టమైన నినాదాన్ని ఇస్తున్నట్లు తెలిపారు. మరో జగిత్యాల జైత్రయాత్ర ద్వారా ప్యూడలిజాన్ని అంతమొందిం చి సామాజిక తెలంగాణను స్థాపిద్దామనే నినాదాన్ని ఇస్తున్నట్లు తెలిపా రు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల సందర్భంగా నిరుపేదలకు డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ళు, దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని, అయితే ఇంత వరకు ఆ హామీ నెరవేరలేదన్నారు. అదే విధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లించాలని, మూడెకరాలు ఇవ్వని దళితులకు ఆర్థిక సాయం అందించాలని కోరా రు. సుమారు నాలుగున్నర వేల మం ది రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారో చెప్పాలన్నారు.

52 శాతం ఉన్న బీసీల చేతి వృత్తులు అం తమయ్యాయని, వారికి రాజకీయ అ ధికారం కూడా దక్కడం లేదన్నారు. ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్లు ఏవిధంగా ఇస్తారో చెప్పాలని ప్రశ్నించారు. సమస్యలను పక్కదారి పట్టించేందుకు బడుగు, బలహీనవర్గాలకు గొర్రెలు, బర్రెలు ఇస్తూ కాలాన్ని వెల్లదీస్తున్నాడని విమర్శించారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సి ఉండగా గిరిజనుల మధ్య చిచ్చు పెట్టడాని ఆరోపించారు. అవసరమైన వా టికి డబ్బులు ఖర్చు పెట్టకుండా ఆర్భాటాల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని మండిపడ్డారు. నక్సలైట్ ఏజెండానే మా ఏజెండా అని ప్రకటించిన మా కెసిఆర్ పాలనలో పౌర హక్కులు మంటకలిసి పోయాయని, భూటకపు ఎన్‌కౌంటర్‌లు ఇం కా కొనసాగుతున్నాయని గద్దర్ ఆవేదన వ్యక్తం చేశారు. పత్రికారంగాన్ని ప్రభుత్వరంగ సంస్థగా గుర్తిస్తామని చెప్పిన కెసిఆర్, ఉద్యమానికి ఊపిరిలూదిన జర్నలిస్టులు దుర్భర జీవితా న్ని అనుభవిస్తున్నారని, అలాం టి జ ర్నలిస్టులను కెసిఆర్ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు రూ.30వేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యమంలో పాల్గొని త్యాగాలు చేసిన వా రికి ఉద్య మ ఫలితాలు దక్కడం లేదని, వారందరికీ సముచిత న్యాయం జరగాలని, సామాజిక తెలంగాణ ఏర్పడాలనే ఎ జెండాతో అందరినీ కలుపుకొని టి మాస్ ఫోరాన్ని ఏర్పాటు చేశామన్నా రు. ఈ వేదిక ద్వారా ప్రజల అసలైన డిమాండ్లను నెరవేర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని గద్దర్ తెలిపారు.

Comments

comments