Search
Thursday 18 January 2018
  • :
  • :
Latest News

పాఠశాలల ప్రగతి అందరి బాధ్యత

speak2

మన తెలంగాణ/నర్సాపూర్ : పాఠశాలల ప్రగతి కో సం పాఠశాలల ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీ స భ్యులు అందరు బాధ్యతగా ఉన్నప్పుడే పాఠశాల ప్రగ తి పథంలో సాగుతుందని డిఈఓ విజయకుమారి అ న్నారు. మంగళవారం మండల పరిషత్ కార్యలయం లో నర్సాపూర్ మండల స్థాయి పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పాఠశాలల కమిటీ చైర్మన్‌లకు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ల ఉన్నతి కోసం ప్రధానోపాధ్యాయులు, పాఠశాల క మిటీల ప్రాముఖ్యతను తెలియజేశారు. పిల్లలకు చదు వు చెప్పడంలో ఉపాధ్యాయులు ఎంత మక్కువ చూపుతారో, పాఠశాల ఉన్నతి కోసం కమిటీ సభ్యులు కూడ అంతే ప్రోత్సాహం అందివ్వాలన్నారు. పాఠ్యాంశాల ను పారదర్శకంగా చెప్పాలని, ఆశవాద దృక్పదంతో  ప్రయత్నం సాగేల బోధన ఉండాలన్నారు. పాఠశాలలోని సమస్యలను ఎప్పటికప్పుడూ పై అధికారులకు తెలియ జేస్తూ వాటిని పరిష్కరించే దిశగా సహకరించుకుంటూ  ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ జెమినికుమారి,పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కమిటీల చైర్మన్స్‌లు పాల్గొన్నారు.

Comments

comments