Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

సింగరేణి ఉద్యోగులకు ఎస్‌ఎల్‌పి అందజేత

singareni

మన తెలంగాణ/భూపాలపల్లి (కోల్‌బెల్ట్) : భూపాలపల్లి ఏరియాలో పని చేస్తున్న సింగరేణి ఉద్యోగులు, గనులు మరియు డిపార్ట్‌మెంట్‌లో విధులు నిర్వహిస్తున్న వారికి సర్వీస్ లింక్‌డ్ ప్రమోషన్ (ఎస్‌ఎల్‌పి) ఆర్డర్స్‌ని అందజేయడం జరిగింది. సోమవారం జనరల్ మేనేజర్ కార్యాలయ ఆవరణలో జరిగిన కార్యక్రమానికి సింగరేణి అధికార ప్రతినిధి ఎం.రాజేంద్రకుమార్ పిఎం అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా జనరల్ మేనేజర్ పి. కొండయ్య హాజరై సిబ్బందికి అట్టి ఆర్డర్లను అందజేసి అనంతరం కేక్‌ను కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సింగరేణి అభివృద్ధికి పాటుపడి రక్షణతో కూడిన ఉత్పత్తి తీసుకురావాలని కోరారు. కాగా ఏరియా 490 ఎస్‌ఎల్‌పి ప్రమోషన్లు రావడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ మ్యాజిక్ కళాకారుడు షబ్బీర్ అలీతో మ్యాజిక్ నిర్వహించగా అందరూ ఆనందంలో మునిగిపోయారు. ఈ కార్యక్రమంలో ఎజిఎం అప్పారావు, కిషన్‌రావు, డిజిఎం ఎల్‌అండ్‌ఎ, ఎఎస్‌ఒ రవీందర్, సెక్యూరిటీ ఆఫీసర్లు శ్రీనివాసరావు, అన్ని డిపార్టుమెంట్‌ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
రెండవ వారంలో ఒసి 2 ఉత్పత్తి ప్రారంభం : ఏరియా జిఎం కొండయ్య
ఓపెన్ కాస్టు 2వ గని మట్టిపని పూర్తిచేసి రెండవ వారంలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభమవుతుందని భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ పి. కొండయ్య తెలిపారు. సోమవారం స్థానిక జిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… గత సంవత్సర అనుభవాలను పరిగణలోకి తీసుకుని రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించేందుకు కృషి చేస్తామని తెలిపారు. భూపాలపల్లి ఏరియాలో గ్రేడియంట్ మైన్స్ కావడం వల్ల ఉత్పత్తి తక్కువ అని 2018లో కెటికె ఒసి 2, 3 గనులు, కెటికె 3, 5 లాంగ్‌వాల్‌ల వల్ల ఉత్పత్తి బాగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత సంవత్సరం డిసెంబర్ మాసంలో 91 శాతం ఉత్పత్తి సాధించగా, భూపాలపల్లి ఏరియా 67 శాతం ఉత్పత్తి సాధించిందని అన్నారు. ఓసి 2 ఉత్పత్తి ప్రారంభం కాకపోవడం వల్ల నిర్దేశించిన లక్షం సాధించలేక పోయామని పేర్కొన్నారు. ఓసి 1 డిప్‌సైడ్ ఎక్స్‌టెన్షన్ వల్ల దాని జీవిత కాలంమరింత పెరుగుతుందని అదే విధంగా ఓసి 2 జీవితకాలం 15 సంవత్సరాలు ఉంటుందన్నారు.
* ఒసి కార్మికులకు ప్రత్యేక ఇన్సెంటీవ్…
డిసెంబర్ నెలలో ఒక్క ఒసి కార్మికులే స్పెషల్ ఇన్సెంటీవ్‌కు ఎన్నికయ్యారని మిగతా కార్మికులందరూ ఈ ఇన్సెంటీవ్‌ను సద్వినియోగం చేసుకుని ఉత్పత్తిని పెంచాలని సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పాత ఎస్‌డిఎల్ యంత్రాల స్థానంలో కొత్తగా 20 ఎస్‌డిఎల్ యంత్రాలు వస్తాయని తద్వారా ఉత్పత్తి పెరుగుతుందని 2018 , 2019 ఆర్థిక సంవత్సరానికి లక్షం 38.6 మిలియన్ టన్నులు కాగా భూగర్భ గనుల ద్వారా 17.6, ఒసిలు 21 మిలియన్ టన్నులు అని కార్మికులు, సిబ్బంది సహకారంతో సాధించగలమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి డాక్టర్ రాజేంద్రకుమార్, ఎస్‌వోటు జిఎం రవీందర్, ఎజిఎం ఐ అండ్ ఇడి అప్పారావు, మదార్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments