Search
Sunday 21 January 2018
  • :
  • :

సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్వేయం

cake

*సిఎం కెసిఆర్ అన్ని వర్గాల సంక్షేమమానికి కృషి
*బీడు భూముల సాగు కోసమే ప్రాజెక్టులు
*మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా నీరు
మంత్రి ఈటెల రాజేందర్
మనతెలంగాణ/రామగిరి: ప్రజా సమస్యలు పరిష్కరించ డమే ప్రభుత్వ ధ్యేయమని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజే ందర్ అన్నారు. రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో సోమవారం మన ఊరుమన ఎంఎల్‌ఎ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమా నికి ప్రభుత్వం అనేక ఫథకాలు ప్రవేశపెట్టి వారికి చేదోడు వాదోడుగా నిలుస్తన్నదన్నారు.బీడు భూములను సాగు భూములుగా చేసేందుకు సుందిళ్ల, కాళేశ్వరం ప్రాజెక్ట్‌లు తీసుకురావడం జరిగిందన్నారు. అంతే కాకుండా మిషన్ కాకతీయ ద్వారాచెరువులు, కుంటల మరమత్తులు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా నీరు,ఆసరా పెన్షన్లతో పాటు పలు సంక్షేమ పథాకాలను ప్రజలకు అందించిన ఘనత కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. నియోజకవర్గ అబివృ ద్ది కోసం ముఖ్యమంత్రిని ఒప్పించి,సాగు, తాగునీటి కోసం ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించిన ఘ నత మంథని ఎంఎల్‌ఎ పుట్ట మధుకర్‌కే దక్కిందని ఆ యనను అభినందించారు, అనంతరం మంథని ఎంఎల్‌ఎ పుట్ట మధుకర్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రా మం అబివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు శక్తివంచన లే కుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు, కల్వచర్ల గ్రామంలో ఇప్పటికే సుమారు రూ.2కోట్ల మేర అభివృద్ధి పనులు నిర్వ హించడం జరిగిందని గ్రామాన్ని మరింత అభివృద్ధి చే సేందుకు నిధులు మంజూరు చేయిస్తానన్నారు, అనంత రం పుట్ట మధుకర్ నూతన సంవత్సర కేక్‌ను కట్‌చేసి మ ంత్రి ఈటెల రాజేందర్‌కునూతన సంవత్సర శు భాకాం క్షలు తెలిపారు. కల్వచర్ల సర్పంచ్ రేండ్ల ఆశోక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కమాన్‌పూర్ ఎంపిపి ఇనుగంటి ప్రే మలత, మంథని సర్పంచ్ పుట్ట శైలజ, రామగిరి మండల శాఖ అధ్యక్షుడు పూదరి సత్యనారాయణగౌడ్, గంట వెంక టరమణారెడ్డి,దాసరి రాజలింగు,ఇనుగంటి రామారావు, బూర్గు రాజు గౌడ్,నాగెల్లి సాంబయ్య తోపాటు మంథని నియోజకవర్గంలోని ఎంపిటిసిలు, సర్పంచ్‌లు, ప్రజాప్రతి నిధులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

comments