Search
Thursday 19 April 2018
  • :
  • :
Latest News

మనస్థాపంతో యువకుడి ఆత్మహత్య

suicide
మనతెలంగాణ/రామన్నపేట
తండ్రి మందలించాడని మనస్థాపం చెంది యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని దుబ్బాక గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం దుబ్బాక గ్రామానికి చెందిన గట్టు లింగయ్యకు నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. లింగయ్య తన కుటుంబాన్ని పోషించడం కోసం మేకలను పెంచుతూ జీవనం సాగిస్తున్నాడు. చిన్న కుమారుడైన గట్టు బాలకృష్ణ (18) పదవ తరగతి వరకు చదివి తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ మేకలను మేపే వాడు. గత వారం రోజులుగా సరైన సమయానికి మేకలను మేపడంలో ఆలస్యం చేస్తున్నాడని తండ్రి లింగయ్య ఈనెల 3వ తేది రోజున బాలకృష్ణను మందంలించడంతో మనస్థాపానికి గురై పొలంలో ఉన్న చింత చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయంత్రం అయిన కుమారుడు ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చి చుట్టు పక్కన వెతికిన కుటుంబ సభ్యులు పొలం వద్ద చూడగా బాలకృష్ణ చెట్టుకు ఉరి వేసుకొని చనిపోయి ఉన్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. మృతుని తండ్రి లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ .బి.నాగన్న తెలిపారు.

Comments

comments