Search
Sunday 22 April 2018
  • :
  • :
Latest News

రైతులకు అన్యాయం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం

sit

* ఫిబ్రవరిలో బీజేపీ రైతు పోరుగర్జన
మన తెలంగాణ/ఉట్నూర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలోని రైతులను తీవ్ర అన్యాయం చేస్తుందని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కాటం రవీందర్ అన్నారు. శనివారం ప్రెస్‌భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పక్క రాష్ట్రాల్లో ప్రభుత్వాలు రైతులకు బోనస్ అందిస్తుందన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రైతు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. అటవి పందుల బారినుంచి పంటలను రక్షించేందుకు 95 శాతం సబ్సీడిపై సోలార్ ఫిన్సింగ్ అందించాలన్నారు. మరుగుదొడ్ల నిర్మాణం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెబుతోందన్నారు. ప్రతి చేను వరకు విద్యుత్ సరఫరా చేయాలని అవసరమైన చోట సబ్సిడీపై స్తంబాలు ఇవ్వాలన్నారు. జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలన్నారు. ఫిబ్రవరిలో రైతులకు అండగా రైతు పోర గర్జన చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కొమ్మ రాంచందర్, నియోజకవర్గ కన్వీనర్ రమేష్, నాయకులు రాజశేఖర్, రాజన్న, సాయి, శ్రీకాంత్, వెంకటేష్, సంతోష్‌లు పాల్గొన్నారు.

Comments

comments