Search
Thursday 19 April 2018
  • :
  • :
Latest News

అద్భుతం.. ఆశ్చర్యం

ph4

కాళేశ్వరం పనులపై సిడబ్ల్యుసి బృందం పూర్తి సంతృప్తి 

ధర్మారం: కాళేశ్వరంపై కేంద్ర జలవనరుల సంఘ బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర జల వనరుల సంఘం చీఫ్ ఇంజినీర్ కెఎల్. దాన్ ఆధ్వరంలో ముగ్గురు డైరెక్టర్లు రాష్ట్ర ఉన్నతాధికారుల తో కలిసి మంగళవారం కాళేశ్వరం పనులను పూర్తి స్థాయిలో పరిశీలించారు. బృందం ఇచ్చే నివేదిక ఆధారంగానే కాళేశ్వరానికి తుది అనుమతులు లభించే అవకాశాలు ఉండటంతో రాష్ట్ర నీటి పారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్‌రావు, కాళేశ్వరం సిఇలు వెంకటేశ్వర్లు, హరి రాం, ఎస్‌ఇ వెంకట్రాములు, ఇఇ నూనె శ్రీధర్ ఆధ్వర్యంలో అధికారుల బృందం విస్త్రృత ఏర్పాట్లు చేశారు. ఎల్లంపెల్లి ప్రాజెక్ట్‌లో గ్రౌండ్ జీరో నుండి క్షుణ్ణంగా పరిశీలించారు. వెంనూర్ వద్ద ప్రధానంగా ఎల్లంపెల్లి ప్రాజెక్ట్ నీటిని వదిలే గేట్ల బిగింపు 14మీటర్ల జాలువారుతో అండర్‌టన్నెల్‌లోకి వెళ్లే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. నిత్యం రెండు టిఎంసిల నీటిని అండర్‌టన్నెల్ ద్వారా పంపే విధానం వివరాలను పరిశీలించారు. అక్కడి నుండి మేడారంలోని అండర్‌టన్నెలోకి వెళ్లిన బృందం టన్నెల్‌ల ఏర్పాటు అండర్‌గ్రౌండ్‌లో పంపుహౌస్‌ల నిర్మాణం, విద్యుత్ ఉత్పత్తి చేసే సబ్ స్టేషన్‌ల నిర్మాణం చూసి అశ్చర్యం వ్యక్తం చేసారు. స్వదేశి సాంకేతిక పరిజ్ఞానంతో భూగర్భంలో జరుగుతున్న పనులు అద్భుతమని కితాబునిచ్చారు. మూడు షిప్టుల్‌లలో శరవేగంగా పనులు నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ సాంకేతిక బృందాన్ని అభినందించారు. ఈ విషయంపై కేంద్రానికి మాత్రమే నివేదిక సమర్పిస్తామని, మీడియాతో మాట్లాడేందుకు సిడబ్లుసి చీఫ్ ఇంజనీర్ కెఎల్‌దాస్ నిరాకరించారు. ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్‌రావు సిఇలు వెంకటేశ్వర్లు, హరిరాం, ఎస్‌ఇ వెంకట్రాములు, ఇఇ నూనె శ్రీదర్‌లను కేంద్ర బృందం అభినందించింది.

Comments

comments