Search
Monday 23 April 2018
  • :
  • :

భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య

police
కమ్మర్‌పల్లిః కమ్మర్‌పల్లి మండలం బషిరాబాద్‌లో భర్త వేధింపులకు మారంపల్లి లావణ్య (28) గురువారం తన ఇంట్లో ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్.ఐ మురళి తెలిపారు. వివరాలోకేళ్తె భార్యభర్తలయిన లావణ్య, భూమేశ్వర్ల మధ్య తరచు గోడవలు జరిగేవని ఆర్థిక ఇబ్బందుల వల్ల, భర్త భార్యను అనుమానిస్తుండేవాడని దీనిద్వారా విరక్తి చెందిన లావణ్య బుధవారం నాడు భార్యభర్తల మధ్య గొడవ చొటు చేసుకుందని భర్త పొలం పనులకు వెళ్ళిన సమయంలో ఎవ్వరు లేనిది చూసి విసుగు చెందిన లావణ్య ఉరివేసుకోని ఆత్మహత్యకు పాల్పడిందని ఎస్.ఐ వివరించారు. మృతురాలి తండ్రి ఘంటోజి ఆశన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా మృతురాలికి కూతురు సాహస్ర (3), కుమారుడు సాయి (15 నెలలు) ఉన్నారు.

Comments

comments