Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

నీటి కుంటలో పడి మహిళ మృతి

suicide
మనతెలంగాణ/శామీర్‌పేట : పెద్ద చెరువు పక్కన నీటి కుంటలో ఓ మహిళ మృతదేహం లభ్యమైన సంఘటన శామీర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం మండల కేంద్రం కట్టమైసమ్మ ఆలయం వద్ద యాచిస్తు జీవనం గడుపుతున్న లక్ష్మీ(48) నీటి కుంటలో పడి మృతి చెందింది. గత 20 సంవత్సరాల క్రితం ఎక్కడి నుంచో వచ్చి శామీర్‌పేటలో తిరుగుతుండగా శామీర్‌పేటకు చెందిన పోచయ్య ఆమెతో సహజీవనం చేస్తు జీవించారు. వారికి ఇద్దరు సంతానం ఉండగా గత 6 సంవత్సరాల క్రితం పోచయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి వారి పిల్లలను సరిగ్గ చూడటం లేదని బందువులు మండలంలోని సరస్ అనాదాశ్రమంలో చేర్పించారు. మతిస్థిమితం కొల్పోయిన లక్ష్మీ కట్టమైసమ్మ ఆలయం వద్ద యాచిస్తు జీవిస్తుంది. మూడు రోజుల క్రితం బట్టలు ఉతకడానికి వెల్లి ప్రమాద వశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందవచ్చని పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఎస్‌ఐ గజేందర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments