Search
Sunday 22 April 2018
  • :
  • :
Latest News

న్యాయస్థానాల్లో న్యాయం జరగడం లేదు

hand

*సంస్మరణ సభలో సామాజిక విశ్లేషకులు కదిరే కృష్ణ

మనతెలంగాణ/నిజామాబాద్ సిటి: రాష్ట్రంలో దళితులపై దాడులు, హత్యలు పరంపర కొనసా గుతున్నాయని, న్యాయం కోసం న్యాయస్థానాల్లోకి వెళ్లిన దళితులకు న్యాయం జరగడం లేదని సామాజిక విశ్లేషకులు కదిరె కృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం రాజీవ్‌గాంధీ ఆడిటో రియంలో ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీల ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమా వేశంలో ఆయన మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల క్రితం తలారి సత్యం కేసులో నిందితు లను అరెస్టు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. సత్యం హత్యలో ఆర్మూర్ ఎమ్యెల్యేను అరెస్టు చేయాలని కదిరెకృష్ణ డిమాండ్ చేశారు. పోలీసులు, న్యాయస్థానాల్లో బాధితులకు న్యాయం జరగకపోవడం, వీరిద్దరి కేసు నిరూపించిందని అన్నారు. రాష్ట్రంలో దళితుల వర్ధంతి సభలు నిర్వహించుకుంటే రాష్ట్ర ప్రభుత్వం సంబరాలు చేసుకుంటుందని ఆయన ఆరోపించారు. ఎన్‌కౌ ంటర్‌లో హత్యలే కాకుండా దళితులను దాడులతో భయభ్రాంతులకు గురి చేస్తూ హత్యలు చేస్తుందన్నారు. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో జరిగిన విఆర్‌ఎ సాయిలు హత్య, అభంగపట్నం ఉదంతం, మందని మధుహత్య, ఆర్మూర్ రోజహత్యలాంటి ఘటనలు అనేకం ఉన్నాయని ఆందోళన చేశారు. ఏ ఒక్క కేసులో కూడా బాధితులకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో కోర్టుల్లో కూడా కులం ప్రధాన పాత్ర పోషిస్తున్నారని కృష్ణ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జెఎసి కన్వీనర్ సావెల్ గంగాధర్, సిపిఐ జిల్లా కార్యదర్శి కంజరభూమయ్య, న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ప్రభాకర్, టిజెఎసి అధ్య క్షులు గోపాల్‌శర్మ, వినోద్‌కుమార్, కోటేశ్వర్ రావు, రాజేశ్వర్, సమీర్‌హైమాద్, రాజారాం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

 

Comments

comments